Interesting Discussion on Dhanush Sekhar Kammula Movie Storyline

Wednesday,August 11,2021 - 08:12 by Z_CLU

ధనుష్, శేఖర్ కమ్ముల సినిమా ఎనౌన్స్ మెంట్ రాగానే ఈ ఇద్దరు ఏ జోనర్ లో సినిమా చేస్తారనే డౌట్ అందరికీ వచ్చింది. ఇప్పటికీ ఆ డౌట్ అలాగే ఉంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తుంది. అవును శేఖర్ కమ్ముల ధనుష్ కోసం ఓ పొలిటికల్ స్క్రిప్ట్ రాసి అప్రోచ్ అయ్యాడని, పొలిటికల్ స్క్రిప్ట్ నచ్చడంతోనే ధనుష్ ఈ ప్రాజెక్ట్ సైన్ చేశాడని టాక్ వినబడుతుంది.

గతంలో శేఖర్ కమ్ముల రానా ని హీరోగా పరిచయం చేస్తూ 'లీడర్' అనే సినిమా తెరకెక్కించాడు. అప్పటి వరకు సాఫ్ట్ లవ్ లవ్ స్టోరీస్ మాత్రమే హ్యాండిల్ చేసిన శేఖర్ కమ్ముల ఒక్కసారిగా జోనర్ మార్చడంతో అప్పట్లో ఆ సినిమా గురించి అందరు మాట్లాడుకున్నారు. 'లీడర్' అనుకున్నంత విజయం సాధించలేదు కానీ శేఖర్ చెప్పిన మెసేజ్ అందరకీ నచ్చింది. ఆ సినిమా ద్వారా కుల రాజకీయాలు కుటుంబ రాజకీయాలపై తనదైన స్టైల్ లో స్పందించాడు శేఖర్ కమ్ముల.

Sekhar Kammula Dhanush Movie

ఇప్పుడు మళ్ళీ ఇన్నాళ్ళకి పొలిటికల్ డ్రామా జోనర్ లో శేఖర్ కమ్ముల నుండి సినిమా రాబోతుందనే న్యూస్ ఆడియన్స్ లో క్యురియా సిటీ రైజ్ చేస్తోంది. సినిమాలో ధనుష్ ఓ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తాడని, ఓ స్ట్రాంగ్ మెసేజ్ కూడా ఉంటుందని సమాచారం. మరి దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. నారాయణ దాస్ నారంగ్ , రామ్మోహన్ రావు నిర్మించనున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topic