Vakeel Saab Tease Ready

Sunday,August 30,2020 - 11:52 by Z_CLU

స్టార్ హీరో పుట్టిన రోజు పురస్కరించుకొని పోస్టర్, టీజర్ రిలీజ్ చేయడం సహజమే. ఇప్పుడు Power Star పవన్ కళ్యాణ్ కి కూడా 'Vakeel Saab' టీం నుండి స్పెషల్ విషెస్ అందబోతున్నాయి. అవును సెప్టెంబర్ 2 న Pawan Kalyan Birthday సందర్భంగా మేకర్స్ మోషన్ పోస్టర్ తో ఓ టీజర్ రిలీజ్ చేయనున్నారని సమాచారం.

ఇప్పటికే ఫస్ట్ లుక్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ సినిమా నుండి పవన్ బర్త్ డే కి రానున్న మోషన్ పోస్టర్ టీజర్ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి. దిల్ రాజు, బోనీ కపూర్ లు నిర్మిస్తున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే సినిమా బ్యాలెన్స్ షూట్ ను ఫినిష్ చేయనున్నారు.