Pawan Kalyan’s VakeelSaab on Zee Telugu soon

Friday,July 09,2021 - 01:14 by Z_CLU

ఇప్పటికే థియేటర్లలో దుమ్ముదులిపాడు వకీల్ సాబ్. ఈ సినిమా రాకతో అప్పటివరకు స్తబ్దుగా ఉన్న స్క్రీన్స్ అన్నీ కళకళలాడాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ కావడంతో అతడి ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా థియేటర్లకు క్యూ కట్టారు.

[video width="848" height="480" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2021/07/vakeel-saab-zee-telugu.mp4"][/video]

అలా థియేటర్లలో హంగామా చేసిన వకీల్ సాబ్ సినిమా ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై కూడా సందడి చేయబోతోంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా జీ తెలుగు ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా గ్రాండ్ గా టెలికాస్ట్ కాబోతోంది.

పవర్ ఫుల్ వకీల్ సాబ్ గా పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమాలో స్పెషాలిటీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆడియన్స్ అందరికీ వకీల్ సాబ్ ఎట్రాక్షన్స్ తెలుసు. పవన్ కల్యాణ్ ఎప్పీయరెన్స్, యాక్షన్, మేనరిజమ్స్ మొదటి ఎలిమెంట్ అయితే.. ముద్దుగుమ్మలు నివేత థామస్, అంజలి, అనన్య నాగళ్ల పెర్ఫార్మెన్స్ మరో ఎలిమెంట్.

[video width="848" height="480" mp4="http://admin.zeecinemalu.com/wp-content/uploads/2021/07/vakeel-saab-zee-telugu-tv.mp4"][/video]

ఇక ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన పాటలతో, ఆర్ఆర్ తో సినిమాను నెక్ట్స్ లెవెల్ లో నిలబెట్టాడు తమన్. వేణుశ్రీరామ్ డైరక్షన్ లో దిల్ రాజు బ్యానర్ పై వచ్చిన ఈ మెగా మూవీ.. ఇప్పుడు జీ తెలుగు ఆడియన్స్ కోసం ఎక్స్ క్లూజివ్ గా రెడీ అవుతోంది. మరికొన్ని రోజుల్లో జీ తెలుగులో ఈ సినిమా టెలికాస్ట్ కాబోతోంది. మరో పవర్ ప్యాక్డ్ హంగామాకు రెడీగా ఉండండి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics