Vakeel Saab Shooting Completed

Monday,January 11,2021 - 04:16 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాకు సంబంధించి టోటల్ షూటింగ్ పూర్తయింది. లాస్ట్ షెడ్యూల్ తో పాటు కొంత ప్యాచ్ వర్క్ పూర్తిచేసి ఈ సినిమా మొత్తం షూటింగ్ ను కంప్లీట్ చేసినట్టు యూనిట్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

మరోవైపు ఈ మూవీ టీజర్ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14, సాయంత్రం 6 గంటల 3 నిమిషాలకు టీజర్ ను రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి టీజర్ చాన్నాళ్ల కిందటే రెడీ అయింది. మంచి డేట్ కోసం వెయిట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారంతే.

పవన్-శృతిహాసన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు వేణుశ్రీరామ్ దర్శకుడు. అంజలి, నివేత థామస్, అనన్య ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలో పవన్, పవర్ ఫుల్ లాయర్ గా కనిపించబోతున్నాడు.