ZeeCinemalu – Jan 12

Monday,January 11,2021 - 09:41 by Z_CLU

జెర్సీ నటీనటులు : నాని, శ్రద్ధా దాస్ ఇతర నటీనటులు : సత్యరాజ్, మాస్టర్ రోనిత్ కామ్ర, హరీష్ కళ్యాణ్, విశ్వనాథ్ దుద్దుంపూడి, సానుష మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : అనిరుద్ రవిచందర్ డైరెక్టర్ : గౌతమ్ తిన్ననూరి ప్రొడ్యూసర్ : సూర్యదేవర నాగవంశి రిలీజ్ డేట్ : 19 ఏప్రిల్ 2019 అర్జున్ (నాని).. క్రికెట్ అతడి ప్రపంచం. హైదరాబాద్ ప్లేయర్ గా ది బెస్ట్ అనిపించుకుంటాడు. రంజీల్లో కూడా సత్తా చాటుతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో క్రికెట్ ను వదిలేస్తాడు. ప్రేమించిన సారా (శ్రద్ధ శ్రీనాధ్)ను పెళ్లి చేసుకుంటాడు. వాళ్లకు ఓ కొడుకు కూడా పుడతాడు. కానీ క్రికెట్ ను వదిలేసి పదేళ్లయినా జీవితంలో సెటిల్ అవ్వడు అర్జున్. భార్య సంపాదన మీద బతుకుతుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కూడా పోగొట్టుకుంటాడు. అనుకోని సంఘటనల మధ్య మరోసారి క్రీజ్ లోకి అడుగుపెడతాడు అర్జున్. ఊహించని విధంగా క్రికెట్ బ్యాట్ పట్టుకుంటాడు. 36 ఏళ్ల లేటు వయసులో అర్జున్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటాడు? అసలు అర్థాంతరంగా అర్జున్ క్రికెట్ ను వదిలేయడానికి కారణం ఏంటి? క్లయిమాక్స్ లో అర్జున్ ఏం సాధించాడు? అనేది బ్యాలెన్స్ కథ.

=======================

దేవత హీరోహీరోయిన్లు – శోభన్ బాబు, శ్రీదేవి ఇతర నటీనటులు – జయప్రద, మోహన్ బాబు, రావుగోపాల్రావు సంగీతం – చక్రవర్తి దర్శకత్వం – కె.రాఘవేంద్రరావు విడుదల తేదీ – 1982, సెప్టెంబర్ 4 దేవత పేరుచెప్పగానే బిందెలు గుర్తొస్తాయి. చీరలతో చేసిన డెకరేషన్ గుర్తొస్తుంది. ఆ వెంటనే ఓ సూపర్ హిట్ సాంగ్ గుర్తొస్తుంది. అదే వెల్లువొచ్చి గోదారమ్మ పాట. దర్శకుడు కె.రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు చక్రవర్తి కాంబినేషన్ లో చాలా సినిమాలొచ్చాయి. వాటిలో ఎన్నో పాటలు హిట్ అయ్యాయి. కానీ దేవతలోని ఈ పాట మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది.

========================

సుప్రీమ్ నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రాశిఖన్నా ఇతర నటీనటులు : మాస్టర్ మైఖేల్ గాంధీ, రాజేంద్ర ప్రసాద్, కబెర్ దుహాన్ సింగ్, రవి కిషన్, సాయి కుమార్, మురళీ మోహన్, తనికెళ్ళ భరణి మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్ డైరెక్టర్ : అనల్ రావిపూడి ప్రొడ్యూసర్ : దిల్ రాజు రిలీజ్ డేట్ : మే 5, 2016 సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ సుప్రీమ్. తేజ్ కరియర్ లోనే బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ గా నిలిచిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తేజ్, మాస్టర్ మైఖేల్ గాంధీ కాంబినేషన్ లో ఉండే ట్రాక్ సినిమాకి బిగ్గెస్ట్ ఎసెట్.

=======================

ఒంగోలు గిత్త నటీనటులు : రామ్ పోతినేని, కృతి కర్బందా ఇతర నటీనటులు : ప్రకాష్ రాజ్, కిషోర్ దాస్, ప్రభు, అజయ్, అభిమన్యు సింగ్, ఆహుతి ప్రసాద్, రమాప్రభ, రఘుబాబు, సంజయ్ రెడ్డి తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : G.V. ప్రకాష్ కుమార్ డైరెక్టర్ : భాస్కర్ ప్రొడ్యూసర్ : B.V.S.N. ప్రసాద్ రిలీజ్ డేట్ : 1 ఫిబ్రవరి 2013 రామ్ కరియర్ లోనే అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఒంగోలుగిత్త. పసితనంలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి, ఆ కుట్ర వెనక దాగిన పెద్ద మనిషి అసలు రంగును బయటపెట్టడానికి వచ్చిన యువకుడిలా రామ్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో కృతి కర్బందా హీరోయిన్ గా నటించింది.

==========================

తడాఖా నటీనటులు : నాగచైతన్య, సునీల్, తమన్నా, ఆండ్రియా జెరెమియా ఇతర నటీనటులు : ఆశుతోష్ రానా, నాగేంద్ర బాబు, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, రఘుబాబు, రమాప్రభ మరితు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్ డైరెక్టర్ : కిషోర్ కుమార్ పార్ధసాని ప్రొడ్యూసర్ : బెల్లంకొండ సురేష్ రిలీజ్ డేట్ : 10th మే 2013 నాగచైతన్య, సునీల్ అన్నాదమ్ములుగా నటించిన ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ తడాఖా. తండ్రి చనిపోగానే వచ్చిన పోలీసాఫీసర్ ఉద్యోగంలో ఇమడలేని అన్నకు తమ్ముడు ఎలాచేదోడు వాదోడుగా నిలిచాడు, కథ చివరికి ఏ మలుపు తిరిగిందనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

====================

అందాల రాముడు నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్ ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్ డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్ ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్ రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006 సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.