Tollywood Shooting Updates

Tuesday,November 10,2020 - 04:12 by Z_CLU

కరోనా ఎఫెస్ట్ తో లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ వాయిదా వేసుకున్న సినిమాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. RRR నుండి నాగశౌర్య సినిమా వరకూ కొన్ని సినిమాలు సెట్స్ పైకి వచ్చేశాయి. మరి మళ్ళీ షూటింగ్ మొదలుపెట్టుకొని శరవేగంగా వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలేంటో చూద్దాం.

Acharya motion poster chiranjeevi

కొన్ని నెలలుగా షూటింగ్ కి బ్రేక్ పడిన 'Acharya'ఎట్టకేలకు మళ్ళీ సెట్స్ పైకి వచ్చింది. ముందుగా Chiranjeevi పై కొన్ని కీలక సన్నివేశాలు ప్లాన్ చేసిన యూనిట్ ఆయనకీ కరోనా పాజిటీవ్ రావడంతో మిగతా ఆర్టిస్టులపై కోకాపేట్ లోని సెట్ లో కొన్ని సీన్స్ షూట్ చేస్తున్నారు. Konidela Production Company , Matinee Entertainments సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

balayya boyapati movie teaser 2

బాలయ్య , బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న BB3 సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. ప్రస్తుతం బాలయ్య , విలన్ శ్రవణ్ లపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. DWARAKA Creations బ్యానర్ పై మిర్యాల రవీందర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు S Thaman మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ఇటివలే టీజర్ తో హంగామా చేసిన ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్స్ లోకి రానుంది.

pushpa shooting

Allu Arjun , Sukumar కాంబినేషన్ లో మోస్త ఎవైటింగ్ మూవీగా తెరకెక్కనున్న Pushpa షూటింగ్ ఈరోజు నుండి రాజమండ్రి దగ్గర మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుపుకుంటుంది. దాదాపు పది రోజుల వరకు అక్కడ బన్నీ , మిగతా ఆర్టిస్టులపై కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. Mythri Movie Makers బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

kothi kommach movie stills

జాతీయ అవార్డు చిత్ర దర్శకుడు వేగేశ్న సతీష్ దర్శకత్వంలో మేఘాంశ్ శ్రీహరి , సమీర్ వేగేశ్న, రిద్ది కుమార్ , మేఘ చౌదరి హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న 'కోతి కొమ్మచ్చి' షూటింగ్ అమలాపురంలో జరుగుతుంది. ప్రస్తుతం హీరో హీరోయిన్స్ తో పాటు సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్ , VK నరేష్ మిగతా నటీనటులపై పల్లెటూరిలో వచ్చే సన్నివేశాలు తీస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్ సంస్థపై ఎం.ఎల్.వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మిస్తున్న ఈ సినిమాకు అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.

sai dharam tej deva katta

Deva katta దర్శకత్వంలో Sai dharam Tej హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం మియాపూర్ లో తేజ్ మిగతా నటీ నటులపై సీన్స్ తీస్తున్నారు. భగవాన్ , పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి తేజ్ సరసన Aishwarya Rajesh హీరోయిన్ గా నటిస్తుంది.

NagaShourya Ritu Varma Movie 2

Sithara Entertainments బ్యానర్ లో సౌజన్య దర్శకత్వంలో Naga Shaurya హీరోగా నటిస్తున్న సినిమా హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం నాగశౌర్య , వెన్నెల కిశోర్ మిగతా నటులపై ఆఫీస్ సన్నివేశాలు షూట్ చేస్తున్నారు. Romantic Entertainer గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శౌర్య సరసన Ritu Varma హీరోయిన్ గా నటిస్తుంది.