Thaman to compose music for Vijay Vamsi Paidipally Movie

Tuesday,September 28,2021 - 03:57 by Z_CLU

మహర్షి సినిమాతో నేషనల్ అవార్డు పొందిన వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ విజయ్ తో తెలుగు , తమిళ్ లో బైలింగ్వెల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఎనౌన్స్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. #Vijay66 గా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు మేకర్స్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరనేది ఇపుడు హాట్ టాపిక్ అయింది.

విజయ్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకే కాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. 'అల వైకుంఠ పురములో' తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తమన్. ఆ సినిమాతో వరుస భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ అందుకొని ఫుల్ బిజీ అయిపోయాడు. దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ సినిమా 'వకీల్ సాబ్' కి కూడా తమన్ మంచి ఆల్బం ఇచ్చాడు. అందులో మగువా మగువా సాంగ్ బాగా పాపులర్ అయింది.

అందుకే దిల్ రాజు రిఫరెన్స్ తో ఈ ప్రాజెక్ట్ లోకి తమన్ ని తీసుకున్నాడట వంశీ పైడిపల్లి. గతంలో వంశీ డైరెక్ట్ చేసిన 'బృందావనం' సినిమాకు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబోలో సినిమా రాబోతుందన్నమాట. త్వరలోనే మేకర్స్ తమన్ మ్యూజిక్ కంపోజర్ అనే విషయాన్ని విజయ్ ఫ్యాన్స్ కి తెలియజేసి అప్ డేట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విజయ్ తో వంశీ ఎలాంటి సినిమా చేస్తాడా ? అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics