#Vijay66 - మ్యూజిక్ ఎవరంటే?

Tuesday,September 28,2021 - 03:57 by Z_CLU

మహర్షి సినిమాతో నేషనల్ అవార్డు పొందిన వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ విజయ్ తో తెలుగు , తమిళ్ లో బైలింగ్వెల్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఎనౌన్స్ అయిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. #Vijay66 గా తెరకెక్కనున్న ఈ సినిమా గురించి ఇంకా ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు మేకర్స్. అయితే ఈ సినిమాకు మ్యూజిక్ ఎవరనేది ఇపుడు హాట్ టాపిక్ అయింది.

విజయ్ ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అందుకే కాస్ట్ అండ్ క్రూ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు తమన్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేసుకున్నారని సమాచారం. ‘అల వైకుంఠ పురములో’ తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు తమన్. ఆ సినిమాతో వరుస భారీ ప్రాజెక్ట్స్ ఆఫర్స్ అందుకొని ఫుల్ బిజీ అయిపోయాడు. దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ సినిమా ‘వకీల్ సాబ్’ కి కూడా తమన్ మంచి ఆల్బం ఇచ్చాడు. అందులో మగువా మగువా సాంగ్ బాగా పాపులర్ అయింది.

Thaman-shares-sai-dharam-tej-update-with-fans

అందుకే దిల్ రాజు రిఫరెన్స్ తో ఈ ప్రాజెక్ట్ లోకి తమన్ ని తీసుకున్నాడట వంశీ పైడిపల్లి. గతంలో వంశీ డైరెక్ట్ చేసిన ‘బృందావనం’ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇచ్చాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ కాంబోలో సినిమా రాబోతుందన్నమాట. త్వరలోనే మేకర్స్ తమన్ మ్యూజిక్ కంపోజర్ అనే విషయాన్ని విజయ్ ఫ్యాన్స్ కి తెలియజేసి అప్ డేట్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. విజయ్ తో వంశీ ఎలాంటి సినిమా చేస్తాడా ? అని మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics