Sukumar appreciation on VakeelSaab

Friday,May 07,2021 - 08:22 by Z_CLU

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన 'వకీల్ సాబ్' అటు థియేటర్స్ లోనూ ఇటు ఓటిటిలోనూ మంచి రెస్పాన్స్ అందుకొని సక్సెస్ సాధించింది. తాజాగా ఈ సినిమా సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నా అంటూ దర్శకుడు శ్రీరామ్ వేణు మీడియాతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ సక్సెస్ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికే చెందుతుందని ఆయన అన్నారు. పవన్ గారు చేయడం వల్లే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిందని ఆయన తెలిపారు.

ఇక సినిమా ఫ్యాన్ షో కి వెళ్ళినప్పుడు సహజంగా ఫ్యాన్స్ మాత్రమే కనిపిస్తారని కానీ వకీల్ సాబ్ ఫ్యాన్స్ షో కి మహిళకు కూడా కనిపించారని, అందులో మధ్య వయసు గల వారు కూడా కనిపించారని ఆరోజు ఓ అమ్మాయి తన చేతిని గట్టిగా పట్టుకొని థాంక్స్ చెప్పిందని, ఈ సినిమా చేసినందుకు కళ్యాణ్ గారికి నా తరుపున థాంక్స్ చెప్పండి మీరు కలిసినప్పుడు అని చెప్పేసి వెళ్లిందని అది తనకి బెస్ట్ కాంప్లిమెంట్ అని శ్రీరామ్ వేణు చెప్పుకున్నారు.

అలాగే ఈ సినిమా థియేటర్స్ తో పాటు ఓ టి టి లో కూడా పెద్ద హిట్ సాధించిందని ఆరోజు అందరి ఇళ్ళల్లో వకీల్ సాబ్ చూశారని, కరోన కారణంగా థియేటర్స్ లో మిస్ అయిన కుటుంబాలు OTT లో చూసి ఎంజాయ్ చేశారని తనకి కొన్ని వేల మెసేజెస్ వచ్చాయని తెలిపారు. ఇక తన గురువు సుకుమార్ నుండి సినిమా రిలీజ్ తర్వాత ఓ పది నిమిషాల వాయిస్ మెసేజ్ వచ్చిందని, వారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా సినిమా గురించి చెప్తూ మాట్లాడారని అది సప్రయిజ్ కాంప్లిమెంట్ అనిపించిందని చెప్పారు వేణు. వకీల్ సాబ్ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో త్వరలోనే నెక్స్ట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఆ సినిమా డీటెయిల్స్ బయటికి రానున్నాయి. పవన్ తర్వాత ఈ డైరెక్టర్ ఎవరిని డైరెక్ట్ చేస్తాడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics