Sundeep Kishan Gully Rowdy first single released

Friday,May 07,2021 - 08:29 by Z_CLU

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న 'గల్లి రౌడీ' సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజైంది. రామ్ మిర్యాల కంపోజ్ చేయడంతో పాటు తనే స్వయంగా పాడిన ఈ పాట మ్యూజిక్ లవర్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. "పుట్టెనే ప్రేమా..పడగొట్టెనే ప్రేమా.... ఏం చేశావో ఏమో కదమ్మా " అంటూ ఓ అందమైన అమ్మాయి ప్రేమలో పడిన కుర్రాడి ఫీలింగ్ ని మంచి సాహిత్యంతో చెప్తూ పాటకు మరింత అందం తీసుకొచ్చాడు భాస్కరభట్ల రవికుమార్. ఇదే పాటలో "నీ పేరేంటో చెప్పు పచ్చబొట్టేసుకుంట...నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంట...సెల్ నెంబర్ని చెప్పు రింగు ఇచ్చేసుకుంట...మంచి డేటుంటే చెప్పు పెళ్ళి చేసేసుకుంట" అనే లైన్స్ కుర్రకారు సరదాగా పాడుకునేలా ఉన్నాయి.

యువతను ఆకర్షించేలా రామ్ మిర్యాల కంపోజ్ చేసి పాడిన ఈ సాంగ్ ప్రెజెంట్ సోషల్ మీడియాలో హంగామా చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తుంది. జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్ ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉంది. ఇటివలే రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై హైప్ తీసుకొచ్చింది. సందీప్ కిషన్ క్యారెక్టర్ తో పాటు రాజేంద్ర ప్రసాద్, పోసాని , వైవా హర్ష కామెడీ పాత్రలు సినిమాలో బాగా ఎంటర్టైన్ చేస్తాయని మేకర్స్ చెప్తున్నారు.

MVV సత్యనారాయణ , కోనా వెంకట్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సాయి కార్తీక్ , రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన నేహ హరిరాజ్ శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే థియేటర్స్ లోకి రానుంది.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics