Sridevi Soda Center Pre Release event Details
Saturday,August 21,2021 - 12:13 by Z_CLU
సుధీర్ బాబు హీరోగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు సంబంధించి రోజురోజుకు బజ్ డబుల్ అవుతోంది. రీసెంట్ గా రిలీజైన ట్రయిలర్ తో అంచనాలు ఆకాశన్నంటాయి. ఇదే ఊపులో సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ ఎన్-కన్వెన్షన్ లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. 27న సినిమా థియేటర్లలోకి వస్తుంది.
శ్రీదేవి సోడా సెంటర్ లో సూరిబాబు పాత్రలో కనిపించబోతున్నాడు సుధీర్ బాబు. అతడి లుక్స్, మేనరిజమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పలాస ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటించింది. సినిమా జానర్ ఏంటి, కథ ఎలా ఉండబోతోంది, హీరోహీరోయిన్ల క్యారెక్టర్స్ ఏంటి లాంటి అంశాల్ని ఇప్పటికే ట్రయిలర్ లో డీటెయిల్డ్ గా చెప్పేశారు. ఇప్పుడీ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని ఎక్స్ క్లూజివ్ డీటెయిల్స్, సాయంత్రం జరగనున్న ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో బయటకొచ్చే ఛాన్స్ ఉంది.
అలాగే మణిశర్మ అందించిన పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ చాలా బాగుంది. ఈ మధ్యే ఈ సినిమా నుంచి విడుదలైన నాలో ఇన్నాళ్లుగా కనిపించని.. అంటూ సాగే డ్యూయెట్కు కూడా చాలా మంది స్పందన వస్తుంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి అద్భుతమైన సాహిత్యం ఈ పాటను మరో స్థాయికి చేర్చింది. దాన్ని దినకర్, రమ్య బెహ్రా అంతే అద్భుతంగా ఆలపించారు.
ఇలా అన్ని యాంగిల్స్ లో శ్రీదేవి సోడా సెంటర్ సినిమా మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా.. భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో విడుదలకాబోతోంది. సెకెండ్ వేవ్ తర్వాత అత్యథిక సంఖ్యలో థియేటర్లు దక్కించుకున్న సినిమాగా ఇది రికార్డ్ సృష్టించబోతోంది.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics