Sree Vishnu’s ‘Bhala Thandhanana’ release date out

Friday,April 22,2022 - 03:35 by Z_CLU

శ్రీ విష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కిన 'భళా తందనాన' సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. ఏప్రిల్ 30 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. యాక్షన్ డ్రామాగా వస్తున్న సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుంది.

SreeVishnu-BhalaTandhanana-release-date-announced-zeecinemalu

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. రెండు మూడు రోజుల్లో ప్రమోషన్ స్టార్ట్ చేసి బజ్ క్రియేట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. ఇటివలే రిలీజైన టీజర్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. త్వరలోనే ట్రైలర్ కట్ చేసి రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుదల చేయబోతున్నారు.

వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి సమర్పణలో రజనీ కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.

   
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics