SarkaruVaariPaata shooting updates

Tuesday,April 13,2021 - 06:28 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' రెండో షెడ్యుల్ మొదలైంది. ఇటివలే దుబాయ్ లో ఓ షెడ్యుల్ పూర్తి చేసిన యూనిట్ ఇప్పుడు రెండో షెడ్యుల్ ని హైదరాబాద్ లో మొదలు పెట్టారు. ప్రస్తుతం సినిమా కోసం సిటీ శివారులో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మహేష్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈరోజు నుండి ఈ నెల 23 వరకు జరగనున్న ఈ షెడ్యుల్ లో టాకీ తో పాటు ఒక సాంగ్ కూడా షూట్ చేయనున్నారట. ఈ షెడ్యుల్ పూర్తయిన కొన్ని రోజుల గ్యాప్ తర్వాత అమెరికాలో మూడో షెడ్యుల్ ప్లాన్ చేస్తున్నారు. కథ ప్రకారం అక్కడ కొన్ని కీలక సన్నివేశాలు తీయాల్సి ఉంది.

మహేష్ -పరశురామ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్స్ సినిమా కథపై ఆసక్తి నెలకొల్పి బజ్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాలో మహేష్ డ్యుయల్ రోల్ చేయబోతున్నాడనే టాక్ వినబడుతుంది. దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మహేష్ కీర్తి కాంబినేషన్ లో ఇది మొదటి సినిమా.

తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమా పాటలు ఆగస్ట్ నుండి రిలీజ్ కానున్నాయి. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. గీత గోవిందంతో కరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్న డైరెక్టర్ పరశురాం ఈ సినిమాలో మహేష్ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడు? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు సూపర్ ఫ్యాన్స్.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics