Clash between NTR Allu Arjun Movies

Wednesday,April 14,2021 - 02:11 by Z_CLU

ఎవరూ ఊహించని విధంగా ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ సినిమా ముందుకొచ్చింది. దీంతో కొరటాల శివ బన్నీ తో చేయబోయే సినిమా ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది. ఉగాది సందర్భంగా కొరటాల డైరెక్షన్ NTR30 సినిమా ఎనౌన్స్ అయింది. తారక్ సినిమా ఎనౌన్స్ మెంట్ ఇలా వచ్చిందో లేదో వెంటనే బన్నీ తో కొరటాల సినిమా క్యాన్సల్ అంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. బన్నీ -కొరటాల తో సినిమా ఎనౌన్స్ చేసిన యువసుధ ప్రొడక్షన్ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ ప్రశ్నలు వేసారు.

దీంతో యువసుధ నుండి ట్వీట్ వేశారు మేకర్స్. కొరటాల -అల్లు అర్జున్ కాంబో సినిమా కార్డ్స్ లో ఉందని వచ్చే ఏడాది ఏప్రిల్ తర్వాత ఆ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమాకి సంబంధించి మరిన్ని అప్ డేట్స్ తెలియజేస్తామని అన్నారు. దీంతో AA21 సినిమా ఆగిపోయిందనే రూమర్ కి ఫులిస్టాప్ పడింది. ప్రస్తుతం సుకుమార్ తో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ సినిమా పూర్తవ్వగానే మరో ప్యాన్ ఇండియా సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు బన్నీ.

ఇక ఆచార్య ని ఓ కొలిక్కి తీసుకొచ్చిన కొరటాల వెంటనే ఎన్టీఆర్ సినిమాను సెట్స్ పైకి తీసుకురానున్నాడు. వచ్చే ఏడాది కల్లా బన్నీ -కొరటాల తమ ప్రాజెక్ట్స్ ఫినిష్ చేసి తమ కాంబో సినిమాను సెట్స్ పై పెడతారు. మరి సుక్కు -కొరటాల మధ్యలో బన్నీ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడో వేచి చూడాలి.

  • - Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics