RRR Vs KGF2 – Release dates may clash
Monday,August 23,2021 - 05:02 by Z_CLU
ప్రస్తుతం Pan ఇండియా లెవెల్ లో సినీ అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'RRR','KGF2' ముందు వరుసలో ఉంటాయి. అయితే ఈ రెండు సినిమాలు కోవిడ్ కారణంగా షూటింగ్స వాయిదా పడటం దాంతో అనుకున్న రిలీజ్ డేట్స్ ని అందుకోలేకపోవడం కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది. RRR అక్టోబర్ రిలీజ్ అంటూ ఇటివలే మళ్ళీ ప్రకటించారు. కానీ ఇప్పుడు ఆ డేట్ రీచ్ అవ్వడం మేకర్స్ కి కష్టంగా అనిపిస్తుంది. అవును షూటింగ్ కి ఇంకా గుమ్మడి కాయ కొట్టలేదు యూనిట్. ఇంక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఉంది.
సినిమా తీయడానికి ఎంత టైం తీసుకుంటాడో పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా అంతే టైం తీసుకుంటాడు రాజమౌళి. ఇప్పటికే సగంపైనే వర్క్ అయ్యింది. ఇంకా కొంత ఉంది. ఎంత లేదన్నా పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకా రెండు మూడు నెలలు పట్టనుంది. అందుకే వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఉన్నపళంగా 'KGF2' కొత్త రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
దీంతో RRR వర్సెస్ KGF 2 అంటూ సోషల్ మీడియాలో హంగామా నడుస్తుంది. KGF 2 రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది. కానీ RRR రిలీజ్ గురించి తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ , రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రౌద్రం రణం రుధిరం సినిమా ఈ ఏడాదిలోనే వస్తుందా ? లేదా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందా ? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై సర్వత్రా ఆసక్తిగా చూస్తున్నారు మూవీ లవర్స్. మరి జక్కన్న విషయం చెప్పేదెప్పుడో?
మరోవైపు కేజీఎఫ్2 నుంచి ఈరోజు జగపతి బాబు లుక్ ను విడుదల చేశారు. రాజమన్నార్ పాత్రలో మోస్ట్ ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు జగపతిబాబు. సినిమాలోని కీలకమైన విలన్లలో ఒకడిగా జగ్గూ భాయ్ కనిపించే ఛాన్స్ ఉంది.
- - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics