Mega Day – Chiranjeevi Birth Day Celebrations video

Monday,August 23,2021 - 05:05 by Z_CLU

మెగా స్టార్ బర్త్ డే వచ్చిందంటే చాలు మెగా అభిమానులతో పాటు సినీ అభిమానులు , సినీ ప్రముఖులు ఆ రోజుని సెలెబ్రేట్ చేసుకుంటూ చిరుని సోషల్ మీడియా ద్వారా విష్ చేస్తుంటారు. ఇక ఆ రోజు మెగా స్టార్ ఇంట్లో సందడి అంతా ఇంతా కాదు. ప్రతీ ఏడాది చిరుని కలిసి విష్ చేసిన సెలెబ్స్ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ తో సంతోషాన్ని పంచుకుంటారు.

అయితే ఈసారి కూడా మెగాస్టార్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఒక రేంజ్ లో జరిగాయి. కాకపోతే ఎప్పటిలా ఫోటోలు మాత్రమే కాకుండా ఈ మెగా డే కి సంబంధించి వీడియో పోస్ట్ చేసి మరీ ఫ్యాన్స్ కి ఐ ట్రీట్ ఇచ్చారు. చిరు ఇంట్లో సందడి చేసిన సెలెబ్స్ తో పాటు మెగా ఫ్యామిలీ సరదాలు, సంతోషాలు అన్ని వీడియో ద్వారా చూపించారు.

ముఖ్యంగా వీడియోలో చిరు, పవన్ కళ్యాణ్, నాగబాబు మిగతా ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్న విజువల్స్ కనువిందు కలిగించేలా ఉన్నాయి. #MegaDay అంటూ కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ యూ ట్యూబ్ చానెల్ లో రిలీజ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తూ మెగా ఫ్యాన్స్ ని మెప్పిస్తుంది.