RRR Movie Day 1 USA collections, All Time top 3

Saturday,March 26,2022 - 03:16 by Z_CLU

ఓవర్సీస్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కనివినీ ఎరుగని రికార్డులు క్రియేట్ చేస్తోంది. మొదటి రోజే ఈ సినిమాకు ఏకంగా 5 మిలియన్ డాలర్లు వచ్చాయి. ప్రీమియర్స్, మొదటి రోజు వసూళ్లతో కలుపుకొని ఈ మొత్తం కలెక్ట్ చేసింది ఆర్ఆర్ఆర్ మూవీ. (RRR Movie Overseas Day-1).

భరత్ అనే నేను, సాహో, రంగస్థలం లాంటి సినిమాల లైఫ్ టైమ్ కలెక్షన్లు 3 మిలియన్ డాలర్లు. అలాంటిది ఆర్ఆర్ఆర్ సినిమా ఒక్క రోజు వసూళ్లతోనే (5 మిలియన్ డాలర్లు) ఈ సినిమాలన్నింటినీ క్రాస్ చేసింది. ఆర్ఆర్ఆర్ రాకతో ఈ మూవీస్ అన్నీ వెనక్కి వెళ్లిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైతే మొదటి రోజు వసూళ్లలో బాహుబలి-2 రికార్డుల్ని ఆర్ఆర్ఆర్ బద్దలు కొట్టిందో, యూఎస్ లో కూడా బాహుబలి-2 రికార్డుల్ని క్రాస్ చేసింది ఆర్ఆర్ఆర్. మొదటి రోజుకే ఈ సినిమా ఆల్ టైమ్ టాప్-10 లిస్ట్ లో మూడో స్థానానికి ఎగబాకింది. మరికొద్దిసేపట్లో ఇది బాహుబలి-1 ఆల్ టైమ్ కలెక్షన్లను కూడా క్రాస్ చేసి టాప్-2 పొజిషన్ కు చేరబోతోంది.

ఓవర్సీస్ లో అత్యథిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాల జాబితా ఇది.. (లైఫ్ టైమ్ కలెక్షన్లు) బాహుబలి 2 - $20,571,695 ($20 million) బాహుబలి 1 - $6,861,819 ($6.9 million) ఆర్ఆర్ఆర్ - $5 million* (మొదటి రోజుకే ఆల్ టైమ్ జాబితాలో మూడో స్థానం) అల వైకుంఠపురములో - $3,635,809 రంగస్థలం - $3,513,450 భరత్ అనే నేను - $3,416,451 సాహో - $3,233,611 శ్రీమంతుడు - $2,883,437 సైరా - $2,608,115 మహానటి - $2,543,515 పుష్ప - $2,478,144