RRR Movie Day 1 AP Nizam Collections

Saturday,March 26,2022 - 03:28 by Z_CLU

ఎట్టకేలకు బాహుబలి-2ను కొట్టే సినిమా వచ్చింది. RRR Movie రాకతో బాహుబలి-2 రికార్డులు చెల్లాచెదురవుతున్నాయి. మొదటి రోజుకే ఆల్ ఇండియా ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది ఆర్ఆర్ఆర్.

వరల్డ్ వైడ్ ఈ సినిమాకు ఫస్ట్ డే, 223 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. ఓ ఇండియన్ సినిమాకు మొదటి రోజు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే ఫస్ట్ టైమ్. ఓవర్సీస్ లో ఈ సినిమా హాలీవుడ్ మూవీస్ తో పోటీపడిందంటే ఆర్ఆర్ఆర్ హవాను అర్థం చేసుకోండిక. ఆస్ట్రేలియాలో అయితే బ్యాట్ మేన్ సినిమాను కూడా బీట్ చేసింది ఆర్ఆర్ఆర్. ఫస్ట్ డే కలెక్షన్లలో ఇండియాలో ఆర్ఆర్ఆర్ సినిమానే నంబర్ వన్.

RRR day 1 worldwide collection (1)

Worldwide RRR Movie Day 1 Collections (గ్రాస్) ఇలా ఉన్నాయి.. ఏపీ+నైజాం - రూ. 103 కోట్లు కర్నాటక - రూ. 14.48 కోట్లు తమిళనాడు - రూ. 10.73 కోట్లు కేరళ - రూ. 4.16 కోట్లు నార్త్ ఇండియా - రూ. 25.14 కోట్లు యూఎస్ఏ - రూ. 42 కోట్లు నాన్-యూఎస్ (ఓవర్సీస్) - రూ. 25 కోట్లు

ఇలా వరల్డ్ వైడ్ RRR Movie Collections దుమ్ముదులిపాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. నైజాంలో ఈ సినిమా సరికొత్త రికార్డు సృష్టించింది. 23 కోట్ల రూపాయలకు పైగా షేర్ (జీఎస్టీ, హయ్యర్స్ తో కలిపి) కలెక్ట్ చేసి కళ్లుచెదిరేలా ఆల్ టైమ్ రికార్డ్ నెలకొల్పింది. ఫస్ట్ డే కలెక్షన్ లో ఇప్పటివరకు నైజాంలో భీమ్లానాయక్ దే హయ్యస్ట్ షేర్. ఆ సినిమాకు అటుఇటుగా 11 కోట్ల 60 లక్షల షేర్ వచ్చింది. ఇప్పుడు దానికి రెట్టింపు షేర్ ను ఆర్ఆర్ఆర్ మూవీ నైజాంలో కలెక్ట్ చేసింది. (RRR Movie Day 1 Nizam share)

అటు ఆంధ్రాలో కూడా రికార్డులు బద్దలయ్యాయి. ఉత్తరాంధ్ర, ఈస్ట్, వెస్ట్ లో కొత్త రికార్డులు క్రియేట్ అవ్వగా.. సీడెడ్ లో ఆల్ టైమ్ రికార్డ్ నమోదైంది. మొత్తంగా ఏపీ, తెలంగాణలో ఆర్ఆర్ఆర్ మూవీకి 75 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఆర్ఆర్ షేర్లు ఇలా ఉన్నాయి

rrr

RRR Movie Day 1 AP Nizam shares నైజాం - రూ. 23.35 కోట్లు సీడెడ్ - రూ. 17 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 7.42 కోట్లు ఈస్ట్ - రూ. 5.39 కోట్లు వెస్ట్ - రూ. 5.93 కోట్లు గుంటూరు - రూ. 7.80 కోట్లు కృష్ణా - రూ. 4.21 కోట్లు నెల్లూరు - రూ. 3.01 కోట్లు

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics