#RoarofRRR to release tomorrow at 11AM

Wednesday,July 14,2021 - 05:24 by Z_CLU

ఎన్టీఆర్ , రామ్ చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ 'RRR' నుండి రేపు మేకింగ్ వీడియో రిలీజ్ అవ్వబోతుంది. రెండు పాటల మినహా షూట్ పూర్తి చేశాడు రాజమౌళి. ఇప్పటికే రెండు భాషల్లో తారక్ , చరణ్ ఇద్దరూ డబ్బింగ్ పూర్తి చేశారు కూడా. అందుకే రేపటి నుండి మేకింగ్ వీడియోతో అసలైన ప్రమోషన్ మొదలు పెట్టనున్నాడు జక్కన్న. మేకింగ్ వీడియో అంటే ఉత్తి షూటింగ్ కవరేజ్ లా కాకుండా తన మార్క్ భారీ స్థాయిలోనే విజువల్స్ , మ్యూజిక్ తో ఎట్రాక్ట్ చేయనున్నాడట.

రేపు ఉదయం 11 గంటలకు RoarOfRRR పేరుతో రిలీజ్ కానున్న మేకింగ్ వీడియో కి సోషల్ మీడియాలో ఇప్పటి నుండే కౌంట్ డౌన్ మొదలయింది. తారక్ , చరణ్ ఫ్యాన్స్ తో పాటు సినిమా అభిమానులంతా ఈ మేకింగ్ వీడియో కోసం ఎదురుచూస్తున్నారు. ఆ మధ్య ఒక మేకింగ్ వీడియో తో ఆకట్టుకొని సినిమాపై అంచనాలు పెంచేసిన రాజమౌళి రేపు రిలీజ్ చేయబోయే వీడియో తో ఆ అంచనాలను భారీ స్థాయికి చేర్చదానికి రెడీ అవుతున్నాడట.

షూటింగ్ విజువల్స్ తో పాటు ఆర్టిస్టుల ఫన్నీ మూమెంట్స్ , అలాగే టెక్నీషియన్స్ కష్టం ఇలా అన్ని ఎలిమెంట్స్ జోడించి మేకింగ్ వీడియో రెడీ చేసాడట జక్కన్న. అంతే కాదు దీనికి కీరవాణి తో స్పెషల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొట్టించి స్పెషల్ సింగర్ తో హమ్మింగ్ కూడా చేయించారని తెలుస్తుంది. ఇలా అన్నీ పకడ్బందీగా ప్లాన్ చేసిన జక్కన్న రేపు రోర్ ఆఫ్ RRR తో సినిమాను ట్రెండింగ్ లోకి తీసుకొచ్చి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడం ఖాయమనిపిస్తుంది. అలాగే ఈ వీడియో ఎండింగ్ లో అందరూ ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్ కూడా చెప్పే అవకాశముంది. మేకింగ్ వీడియోతోనే ఈ రేంజ్ హంగామా చేస్తే రేపు ట్రైలర్ కి ఇంకెంత హంగామా ఉంటుందో ? చూడాలి. ఏదేమైనా సినిమా మార్కెటింగ్ లో రాజామౌలి మాస్టర్ అంతే.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics