Who will be the hero of Rakshasudu2

Wednesday,July 14,2021 - 02:31 by Z_CLU

కోలీవుడ్ లో బెస్ట్ సైకో క్రైం థ్రిల్లర్ అనిపించుకుంది 'రాక్షసన్'. దాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ తో 'రాక్షసుడు' అంటూ రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. ఈ రీమేక్ తో బెల్లంకొండ శ్రీనివాస్ కూడా చాన్నాళ్ళకి హిట్ అందుకున్నాడు. అందుకే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రమేష్ వర్మ. తాజాగా రాక్షసుడు 2 అంటూ టైటిల్ తో ఈ సీక్వెల్ ను ఎనౌన్స్ కూడా చేశాడు.

అయితే హీరో ఎవరనేది మాత్రం ఇంకా చెప్పలేదు రమేష్ వర్మ. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టారు. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ తోనే ఈ సీక్వెల్ అనుకున్నాడు రమేష్ వర్మ. కానీ శ్రీనివాస్ ప్రస్తుతం ఛత్రపతి రీమేక్ ఆ తర్వాత కర్ణన్ రీమేక్ తో బిజీగా ఉండటంతో మరో హీరోని సంప్రదించే పనిలో ఉన్నాడట రమేష్ వర్మ ఇటివలే ఓ హీరోని కలిసి స్క్రిప్ట్ కూడా చెప్పారని సమాచారం. ఆ హీరో కూడా నెరేషన్ విని ఈ సీక్వెల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది.

ప్రెజెంట్ రవితేజ హీరోగా 'ఖిలాడి' సినిమా చేస్తున్నాడు రమేష్ వర్మ. ఆ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ బ్యాలెన్స్ ఉంది. అది కంప్లీట్ చేసి 'రాక్షసుడు 2' వర్క్ మొదలు పెట్టబోతున్నాడు రమేష్ వర్మ. ఈ లోపు హీరోతో పాటు హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసుకుంటాడు. ఈ సీక్వెల్ కి రాక్షసుడు టెక్నీషియన్స్ నే తీసుకున్నాడు రమేష్ వర్మ. మరి హీరోయిన్ విలన్ ని కూడా వారినే రిపీట్ చేస్తాడా ? లేదా చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics