Raviteja’s Ravanasura Movie Trailer Review

Tuesday,March 28,2023 - 04:49 by Z_CLU

మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రావణాసుర. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయబోతున్నారు. ఈ రోజు ఈ సినిమా ట్రయిలర్ లాంఛ్ చేశారు. (Raviteja's Ravanasura Movie Trailer Review )

యాక్షన్-థ్రిల్లర్ గా తెరకెక్కింది రావణాసుర సినిమా. ఈ మూవీకి సంబంధించి ఏమాత్రం రివీల్ చేసిన స్టోరీ చెప్పేసినట్టు అవుతుందని రవితేజ ఇప్పటికే ఎనౌన్స్ చేశాడు. అందుకే ట్రయిలర్ ను జాగ్రత్తగా కట్ చేశారు.

ట్రయిలర్ చూసి, ఈ సినిమా స్టోరీని గెస్ చేయడం కష్టం. హత్యలు చేస్తోంది రవితేజ అనే విషయాన్ని మాత్రం కన్ ఫర్మ్ చేశారు. ఆ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడనే విషయాల్ని మాత్రం రివీల్ చేయలేదు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది.

"మర్డర్ చేయడం క్రైమ్. దొరక్కుండా మర్డర్ చేయడం ఆర్ట్. ఐయామ్ ఏన్ ఆర్టిస్ట్" అంటూ రవితేజ (Raviteja) చెప్పిన డైలాగ్ టోటల్ ట్రయిలర్ కు హైలెట్ గా నిలిచింది. ట్రయిలర్ లో కీలకమైన పాత్రలన్నింటినీ పరిచయం చేశారు. హీరోయిన్లు, కీలక పాత్ర పోషించిన సుశాంత్ కూడా ఉన్నారు.

ఇది పూర్తిస్థాయిలో యాక్షన్-థ్రిల్లర్ కాదని, కామెడీ కూడా ఉందనే విషయాన్ని ట్రయిలర్ లో స్పష్టం చేశారు. ఈసారి రవితేజ, హైపర్ ఆది కాంబోలో కామెడీ పంచ్ లు చూడబోతున్నాం.

టెక్నికల్ గా సినిమా హై-లెవెల్ లో ఉంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. ఏప్రిల్ 7 నుంచి వరల్డ్ వైడ్ థియేటర్లలో రావణాసుర హంగామా షురూ కాబోతోంది.

https://www.youtube.com/watch?v=qLGZbo_YjqE