RangDe to Release on March 26

Friday,January 01,2021 - 05:20 by Z_CLU

నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రంగ్ దే. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేద్దామని అనుకున్నారు. గతంలో ఇదే విషయాన్ని ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడు రంగ్ దే రిలీజ్ డేట్ మారింది.

ఈ సినిమాను మార్చి 26న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఈరోజు అఫీషియల్ గా వెల్లడించారు. ఈ మేరకు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తూ విడుదల చేసిన వీడియో క్లిప్ అందర్నీ బాగా ఎట్రాక్ట్ చేస్తోంది.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో లవ్-ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతోంది రంగ్ దే. మూవీకి సంబంధించి రీసెంట్ గా దుబాయ్ లో భారీ షెడ్యూల్ పూర్తిచేశారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే.