Vakeel Saab teaser to release on Sankranthi

Friday,January 01,2021 - 11:29 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ, పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ హంగామా సంక్రాంతి నుంచి ప్రారంభం కాబోతోంది. ఈ మూవీ టీజర్ ను సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ తో పాటు.. బ్రాండ్ న్యూ పోస్టర్ కూడా వచ్చేసింది.

పవన్ కల్యాణ్, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా వకీల్ సాబ్. దిల్ రాజు నిర్మాతగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. పైగా ఇది సూపర్ హిట్ పింక్ సినిమాకు రీమేక్ కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

vakeel-saab-teaser-release-date-pawan-kalyan

ఈ అంచనాలకు ఏమాత్రం తీసిపోనివిధంగా తెరకెక్కింది వకీల్ సాబ్ మూవీ. రీమేక్ అయినప్పటికీ, పవన్ కల్యాణ్ స్టార్ డమ్, మేనరిజమ్స్ కు తగ్గట్టు సినిమాలో భారీ మార్పులు చేశారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్.