Producer Dil Raju gives a clarity on F3 Ticket price

Wednesday,May 18,2022 - 03:51 by Z_CLU

'F2' ఫ్రాంచైజీగా వస్తున్న 'F3' మీద ఆడియన్స్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే 'F3' విషయంలో అందరికీ ఓ సందేహం ఉంది. 'ఆచార్య', 'సర్కారు వారి పాట' సినిమాలకు టికెట్ రేటు పెంచారు. ప్రభుత్వం సూచించిన మేరకూ కాస్త పెంచుకొని టికెట్లు అమ్మారు. ఇప్పుడు F3 కి కూడా టికెట్ రేటు పెంచుతారా ? పెంచితే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి వస్తారా ?

ఈ ప్రశ్నలు ఆడియన్స్ మైండ్ లో, ఇండస్ట్రీలోనూ చక్కర్లు కొడుతున్నాయి. వీటన్నిటికి తాజాగా క్లారిటీ ఇచ్చాడు నిర్మాత దిల్ రాజు. "F3 కి సంబంధించి టికెట్ రేటు పెంచడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన పాత రేటుకే టికెట్ రేటు ఉంటుంది. ఫ్యామిలీస్ అంతా వచ్చి థియేటర్స్ లో ఈ సినిమాను ఎంజాయ్ చేయండి" అంటూ స్పెషల్ వీడియో ద్వారా తెలియజేశాడు.

ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న F3 మే 27 న గ్రాండ్ గా రిలీజవుతోంది. వెంకటేష్ , వరుణ్ ల సరసన తమన్నా , మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ , రాజేంద్ర ప్రసాద్ , సోనాల్ చౌహాన్ , అలి, అన్నపూర్ణమ్మ , ప్రగతి , ప్రదీప్ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics