Prabhs Adipurush new release date

Tuesday,September 28,2021 - 01:59 by Z_CLU

పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఏవైటింగ్ మూవీస్ లో 'ఆది పురుష్' ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది ఆగస్టు 11న గ్రాండ్ గా ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు రిలీజ్ డేట్ పోస్టర్ తో సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

రామాయణంలో ఘట్టాలని కథగా చేసుకొని రూపొందిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడు. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఒక వైపు సలార్ సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే ఆది పురుష్ ని కూడా కంప్లీట్ చేస్తున్నాడు ప్రభాస్.

షూటింగ్ పార్ట్ తక్కువే అయినా పోస్ట్ ప్రొడక్షన్ కోసం కొన్ని నెలలు కేటాయించనున్నారు మేకర్స్. ఇప్పటికే కొన్ని VFx కంపెనీలకు కొంత వర్క్ ఇచ్చారు. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని దృష్టిలో పెట్టుకొని వచ్చే ఏడాది డేట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. 2022 ఆగస్టు లో స్వాతంత్ర దినోత్సవంగా ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ప్రభాస్. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు భూషణ్ కుమార్, కృషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ , రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics