Raviteja Trinadha Rao Nakkina Movie Update

Tuesday,September 28,2021 - 01:54 by Z_CLU

ప్రస్తుతం 'ఖిలాడి' షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేస్తున్న మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ శరత్ మండవ దర్శకత్వంలో 'రామారావు' అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాతో పాటే త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో సినిమా కూడా సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు రవితేజ.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 4 నుండి సెట్స్ పైకి రానుందని సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ సినిమా కోసం సెట్ వేస్తున్నారు. ఆ సెట్ లో మొదటి షెడ్యూల్ దాదాపు ఇరవై రోజులు జరగనుందని తెలుస్తుంది. మరో వైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరిగిపోతున్నాయి.

భీమ్స్ సేసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. గతంలో రవితేజ నటించిన బెంగాల్ టైగర్ సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడు భీమ్స్. వీరిద్దరి కాంబోలో ఇది రెండో సినిమా. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ రచయిత. రవితేజ ఇందులో డ్యూయల్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics