Prabhas’s ‘Salar’ release on 2023 summer ?

Saturday,March 26,2022 - 10:25 by Z_CLU

ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ లో భారీ క్రేజ్ ఉన్న సినిమా 'సలార్'. అవును KGF డైరెక్టర్ తో ప్రభాస్ చేస్తున్న ఈ మాస్ యాక్షన్ సినిమా మీద నార్త్ ఆడియన్స్ లో కూడా మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లోకి వస్తుందా ? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు మాస్ యాక్షన్ మూవీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే సినిమాను 2022 సమ్మర్ లో థియేటర్స్ లోకి తీసుకొస్తామని అప్పట్లో ప్రకటించారు మేకర్స్. తాజాగా ఆ ప్లాన్ మార్చుకొని వచ్చే ఏడాదికి సినిమాను షిఫ్ట్ చేశారని తెలుస్తుంది. అవును ఈ ఏడాది సలార్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం లేదనే టాక్ గట్టిగా వినబడుతుంది. ఇక ప్రభాస్ 'ఆది పురుష్' వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. అంటే ప్రభాస్ నుండి వచ్చే ఏడాది ఈ రెండు సినిమాలు పక్కా రిలీజ్ అవుతాయన్నమాట.

ప్రస్తుతం సలార్ రిలీజ్ పోస్ట్ పోన్ అంటూ టాక్ స్ప్రెడ్ అవుతుంది. మరి వీటిని మేకర్స్ ఖండిస్తే క్లారిటీ రావొచ్చు. కానీ టీం నుండి ఎలాంటి క్లారిటీ లేదు. అంటే ఈ ఏడాది రిలీజ్ లేనట్టే కదా ? మరి.