Hridayam remakes rights bagged by Dharma Productions, Fox Studios

Saturday,March 26,2022 - 09:50 by Z_CLU

ఈ ఏడాది యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసిన అల్టిమేట్ లవ్ స్టోరీ 'హృదయం' రీమేక్ రైట్స్ సేల్ అయిపోయింది. తెలుగులో కొందరు స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ రీమేక్ కోసం ట్రై చేసినప్పటికీ ఫైనల్ గా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు ధర్మ ప్రొడక్షన్స్ , ఫాక్స్ స్టూడియోస్ కొనుగోలు చేశాయి. అయితే హిందీ తో పాటు తెలుగు , తమిళ్ రైట్స్ కూడా కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి  నాష్టాలజీ మూమెంట్స్ తో క్యూట్ లవ్ స్టోరీస్ తో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. ఇక హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో కూడా థియేటర్స్ లో బాగానే ఆడింది. ఇటివలే ఓ టి టి లో మరింత మంది చూశారు. ఈ మధ్య కాలంలో బెస్ట్ లవ్ స్టోరీ అంటూ యూత్ ఈ సినిమా చూసేందుకు ఎగబడటంతో హృదయం రీమేక్ రైట్స్ కి రెక్కలొచ్చాయి.

hridayam

భారీ డిమాండ్ పెరిగింది. ఫైనల్ గా ఇప్పుడు బాలీవుడ్ నిర్మాణ సంస్థలు ఫ్యాన్సీ రేటుతో మూడు భాషల రైట్స్ అందుకొని త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. మరి తెలుగు , తమిళ్ లో కూడా ఈ సంస్థలే ఈ రీమేక్ సినిమాను నిర్మించనున్నయా లేదంటే భాగస్వామ్యంతో వేరే సంస్థతో కలిసి నిర్మిస్తాయా తెలియాల్సి ఉంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics