Plan B Movie to release on September 17

Friday,September 10,2021 - 05:30 by Z_CLU

Plan B Movie to release on september 17

శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, బ్లాక్ స్టార్ శాని మరియు నవీనారెడ్డి ముఖ్య తారాగణంతో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్  చిత్రం "ప్లాన్-బి". ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని సెప్టెంబర్ 17న  విడుదల  అవుతుంది. ఈ సందర్భంగా

plan b movie

చిత్ర దర్శకుడు కెవి రాజమహి మాట్లాడుతూ "ప్లాన్ బి చిత్రం ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఆద్యంతం ఉత్కంఠ తో సరికొత్త కథ కథనం తో థ్రిల్లింగ్ అంశాలతో  సాగె కథ ఇది. మా చిత్రాన్ని సెన్సార్ వారు చూసి  సినిమా అద్భుతంగా ఉంది, ఇలాంటి కథని మేము ఎప్పుడు చూడలేదు అని ప్రశంసించి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీనివాస్ రెడ్డి గారు, మురళి శర్మ గారు, సూర్య వశిష్ఠ, రవిప్రకాష్, వీళ్లందరి నటన మా చిత్రానికే ఒక హైలైట్. మా చిత్రాన్ని సెప్టెంబర్ 17న  విడుదల చేస్తున్నాము" అని తెలిపారు.

నిర్మాత ఎవిఆర్ మాట్లాడుతూ "మా ప్లాన్ బి కథ చాలా అద్భుతంగా వచ్చింది. ఫస్ట్ సినిమా అయినా కూడా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా రాజమహి రూపొందించాడు. ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ పై రాని ఉత్కంఠ భరితమైన సన్నివేశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. మా చిత్ర ట్రైలర్ కు విశేష స్పందన లభించింది.  సెప్టెంబర్ 17న  విడుదల చేస్తున్నాం." అని తెలిపారు.

plan b movie

బ్యానర్ : ఎవిఆర్ మూవీ వండర్స్

నటీనటులు : శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ఠ, డింపుల్, మురళి శర్మ, రవిప్రకాష్, నవీనారెడ్డి,  చిత్రం శీను, రాజేంద్ర, బ్లాక్ స్టార్ షాని, డెబోరా దొర్రీస్ ఫిల్, మీనా వాసు, దాయనంద్ రెడ్డి తదితరులు

కెమెరా మాన్ : వెంకట్ గంగాధరి

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్  : శక్తికాంత్ కార్తీక్ (ఫిదా ఫేమ్)

ఎడిటర్ : ఆవుల వెంకటేష్

యాక్షన్ : శంకర్ ఉయ్యాల

ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్

డిటియస్ : రాధాకృష్ణ

డిఐ కలరిస్ట్ :  ప్రేమ్ (ప్రసాద్ ల్యాబ్స్)

సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె

కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం :  కెవి రాజమహి

నిర్మాత : ఎవిఆర్.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics