Latest Announcement from RRR

Saturday,September 11,2021 - 03:42 by Z_CLU

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో SS రాజమౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ ఎవైటింగ్ పాన్ ఇండియా సినిమా #RRR  నుండి అప్డేట్ వచ్చింది.  అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల అక్టోబర్ లో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మేకర్స్ సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు.

RRR Movie working stills from Ukraine ఇటీవలే షూటింగ్ పూర్తయన ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని, అక్టోబర్ వరకు ఫస్ట్ కాపీ రెడీ అవుతుందని తెలిపారు మేకర్స్. ఇక వరల్డ్ సినిమా మార్కెట్ ఓపెన్ అవ్వగానే కొత్త రిలీజ్ డేట్ ప్రకటించి థియేటర్స్ లోకి తీసుకొస్తామని అప్డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది ఆరంభం కల్లా వరల్డ్ సినిమా మార్కెట్ ఓపెన్ అవుతుందనే ఆలోచనతో సంక్రాంతి కి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

RRR Movie working stills from Ukraine ఇప్పటికే జనవరి 8న రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కానీ ఈసారి సంక్రాంతి నాలుగు బడా సినిమాలు రిలీజ్ అవ్వనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ 'Radheshyam' , పవన్ ' Bheem Nayak' , మహేష్ 'Sarkaru Vari Paata'  సంక్రాంతి రిలీజ్ అంటూ డేట్ సహా ఎనౌన్స్ చేశారు. మరి RRR కూడా సంక్రాంతికే వస్తుంది అంటే మరి ప్రకటించిన సినిమాల పరిస్థితేంటి..? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా RRR కొత్త రిలీజ్ డేట్ ప్రకటించే వరకూ రిలీజ్ పై ఇలా చర్చ నడుస్తూనే ఉంటుంది.

Stills from RRR movie Dosti song
  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics