#PawanKalyanRanaMovie Targets Sankranthi

Thursday,June 24,2021 - 03:34 by Z_CLU

పవర్ స్టార్ కళ్యాణ్ రానా తో కలిసి సాగర్ కే చంద్ర దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటివలే రెండు షెడ్యుల్స్ జరుపుకున్న ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంది. మళ్ళీ జులై నుండి షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు యూనిట్. ఈ సినిమాను దసరా కి థియేటర్స్ లోకి తీసుకురావాలని ప్లాన్ చేశారు. దసరా టార్గెట్ పెట్టుకునే షూట్ మొదలు పెట్టి చకచకా సన్నివేశాలు తీశారు. కానీ సెకండ్ వేవ్ కారణంగా ఇప్పుడు రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు.

[caption id="attachment_191374" align="alignnone" width="575"]pawan rana movie zeecinemalu పవన్-రానా మూవీ వర్కింగ్ స్టిల్స్[/caption]

వచ్చే సంక్రాంతికి సినిమాను థియేటర్స్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ లోపు షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేస్తారు. ఇక పవన్ కళ్యాణ్ -క్రిష్ కాంబినేషన్ లో రానున్న 'హరిహర వీరమల్లు' సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా సినిమా కంప్లీట్ అవ్వడానికి టైం పట్టడంతో ఆ స్లాట్ లో పవన్ రానా సినిమాను తీసుకురానున్నారట.

[caption id="attachment_191375" align="alignnone" width="569"]pawan rana movie zeecinemalu పవన్-రానా మూవీ వర్కింగ్ స్టిల్స్[/caption]

ప్రస్తుతం విషయం తెలుసుకొని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. సినిమా ఏదైతేనేం సంక్రాంతికి పవర్ స్టార్ బొమ్మ థియేటర్స్ లో పడబోతుంది అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ నుండి కానీ టీం నుండి కానీ క్లారిటీ రావాల్సి ఉంది. మలయాళ సినిమా అయ్యప్పనమ్ కోశియం కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics