NagaShaurya’s Varudu Kavalenu Shooting Updates

Thursday,June 24,2021 - 03:53 by Z_CLU

ప్రసిద్ధ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ , యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ ‘రీతువర్మ’ జంటగా ‘లక్ష్మీ సౌజన్య’ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం ‘వరుడు కావలెను‘

nagashaurya varudu kavalenu movie zeecinemalu

సినిమా చివరి షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్ లో పునః ప్రారంభమైంది. హీరోహీరోయిన్లు 'నాగ శౌర్య, రీతూవర్మ’లపై ఓ సందర్భోచిత గీతాన్ని నృత్య దర్శకుడు శేఖర్ మాస్టర్ నేతృత్వంలో దర్శకురాలు లక్ష్మీ సౌజన్య చిత్రీకరిస్తున్నారు. ఈ గీతంతో పాటు మరికొన్ని సన్నివేశాల చిత్రీకరణతో త్వరలోనే చిత్రం షూటింగ్ పూర్తవుతుంది.

nagashaurya ritu varma varudu kavalenu movie zeecinemalu 1

‘వరుడు కావలెను‘ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు,నటీ నటుల అభినయాలు చిత్ర కథా నుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయి అన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు చిత్ర దర్శక నిర్మాతలు.

nagashaurya ritu varma varudu kavalenu movie zeecinemalu 2

హీరోహీరోయిన్లు - నాగశౌర్య, రీతువర్మ నటీనటులు - నదియా, మురళీశర్మ, వెన్నెలకిషార్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష మాటలు: గణేష్ కుమార్ రావూరి ఛాయాగ్రహణం: వంశి పచ్చి పులుసు సంగీతం: విశాల్ చంద్రశేఖర్ ఎడిటర్: నవీన్ నూలి ఆర్ట్: ఏ.ఎస్.ప్రకాష్ పి.ఆర్.ఓ. లక్ష్మీవేణుగోపాల్ సమర్పణ: పి.డి.వి.ప్రసాద్ నిర్మాత: సూర్య దేవర నాగవంశి కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం: లక్ష్మీసౌజన్య

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics