Nani Venu Sriram Combination on Cards

Tuesday,June 08,2021 - 03:41 by Z_CLU

ఇటివలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'వకీల్ సాబ్' సినిమా తీసిన దర్శకుడు శ్రీరామ్ వేణు నెక్స్ట్ నానితో సినిమా చేసేందుకు సిద్దమవుతున్నాడు. అవును ఇటివలే నానికి ఓ లైన్ చెప్పి ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నాడట శ్రీరామ్. ప్రస్తుతం స్క్రిప్ట్ కి ఫైనల్ టచ్ ఇచ్చి వర్క్ చేస్తున్నాడని సమచారం. మొన్నటి వరకు శ్రీరామ్ నెక్స్ట్ బన్నీ తో 'ఐకాన్' సినిమా చేస్తాడనే ప్రచారం జరిగింది. ఆ సినిమా ఇంకా ఆలస్యం అవుతుండటంతో ఈ లోపు నానితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట శ్రీరామ్ వేణు.

[caption id="attachment_187280" align="alignnone" width="464"]nani tuck jagadish నాని[/caption]

ప్రస్తుతం నాని చేతిలో రెండు సినిమాలున్నాయి. రాహుల్ సంక్రిత్యన్ తో 'శ్యామ్ సింగ రాయ్' సినిమా చేస్తున్న నాని మరో వైపు వివేక్ ఆత్రేయతో 'అంటే సుందరానికి' సినిమా మొదలు పెట్టాడు. ఈ రెండు సినిమాలు పూర్తి చేసి శ్రీరామ్ వేణుతో సినిమా చేస్తాడని అంటున్నారు. నాని, శ్రీరామ్ వేణు కాంబినేషన్ లో వచ్చిన 'MCA' సూపర్ హిట్ సాధించి మంచి వసూళ్ళు రాబట్టింది. మరి ఈసారి ఈ కాంబో ఎలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.

త్వరలోనే ఈ కాంబో సినిమా నుండి ఎనౌన్స్ మెంట్ రానుందని సమాచారం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics