Allu Arjun’s tentative upcoming movies list after PUSHPA

Tuesday,June 08,2021 - 04:03 by Z_CLU

లాక్ డౌన్ లో టైమ్ అంతా వేస్ట్ అవ్వడంతో హీరోలంతా తమ కెరీర్ విషయంలో ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉన్నారు. అప్ కమింగ్ మూవీస్ విషయంలో పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే కొంతమంది హీరోలు.. రెండేసి సినిమాల్ని లాక్ చేయగా.. ఇప్పుడీ లిస్ట్ లోకి బన్నీ కూడా చేరాడు.

[caption id="attachment_177404" align="alignnone" width="650"]Allu Arjun ICON Movie ఐకాన్ మూవీ పోస్టర్[/caption]

Allu Arjun Icon Movie ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీ తర్వాత చేయబోయే ప్రాజెక్టులకు సంబంధించి ఆప్షన్లు సిద్ధం చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా బన్నీ ముందున్న మొదటి ఆప్షన్ ఐకాన్ మూవీ. చాన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమాను బన్నీ సెట్స్ పైకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. వకీల్ సాబ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వేణుశ్రీరామ్, ఐకాన్ స్క్రిప్ట్ తో అల్లు అర్జున్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.

[caption id="attachment_185235" align="alignnone" width="427"]director BuchiBabu బుచ్చిబాబు[/caption]

Allu Arjun Buchi Babu అల్లు అర్జున్ ఆప్షన్లలో బుచ్చిబాబు కూడా ఉన్నాడు. తొలి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ యంగ్ డైరక్టర్, ఇప్పటికే ఎన్టీఆర్ సినిమాపై వర్క్ చేశాడు. తారక్ బిజీగా ఉండడంతో ఇప్పుడు తన ఫోకస్ ను బన్నీపై పెట్టాడు. బన్నీ-బుచ్చి మధ్య ఆల్రెడీ స్టోరీ డిస్కషన్ జరిగిందని టాక్. బన్నీ కొన్ని మార్పుచేర్పులు చెప్పాడని, బుచ్చి వాటిపై వర్క్ చేస్తున్నాడని అంటున్నారు.

[caption id="attachment_190699" align="alignnone" width="500"]allu arjun Boyapati అల్లు అర్జున్ బోయపాటి శ్రీను[/caption]

Allu Arjun Boyapati ఇక బన్నీ ఆప్షన్లలో ఉన్న దర్శకుడు బోయపాటి శ్రీను. ఈ డైరక్టర్ తో కలిసి వర్క్ చేయడానికి అల్లు అర్జున్ ఎప్పుడూ రెడీగా ఉంటాడు. ఎందుకంటే, సరైనోడు సినిమాతో బన్నీ మాస్ ఇమేజ్ ను డబుల్ చేయడంతో పాటు, మార్కెట్ స్టామినాను కూడా పెంచాడు బోయపాటి. ఆ మూవీ తర్వాత మళ్లీ వీళ్ల కాంబినేషన్ లో సినిమా రాలేదు. అఖండ తర్వాత బన్నీతో బోయపాటి వర్క్ చేస్తాడేమో చూడాలి.

అయితే వీటిలో ఏ ఆప్షన్ ముందుకొచ్చినా, అన్నీ పుష్ప తర్వాతే. రెండు భాగాలుగా రాబోతోంది పుష్ప. వీటిలో ఒకటి ఈ ఏడాదిలోనే వస్తుంది. ఇంకోటి వచ్చే ఏడాది సమ్మర్ కు అంటున్నారు. ఈ రెండూ రిలీజైన తర్వాతే మరోటి మొదలవుతుంది.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics