Mass Maharaja Raviteja joins #Mega154 shoot soon !

Monday,March 14,2022 - 03:03 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి జెట్ స్పీడులో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'గాడ్ ఫాదర్' , 'భోళా శంకర్' సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్న చిరంజీవి ఇటివలే బాబీ డైరెక్షన్ లో MEGA154 సినిమాను కూడా సెట్స్ పై పెట్టేశారు. తాజాగా హీరోయిన్ శృతి హాసన్ కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటికొచ్చింది.

సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ స్పెషల్ క్యారెక్టర్ చేయబోతున్నాడట. అవును మొన్నటి వరకూ ఇది జస్ట్ రూమర్ మాత్రమే అనుకున్నప్పటికీ తాజాగా ఈ ప్రచారం నిజమే అని తెలుస్తుంది. ఇటివలే రవితేజ రెమ్యునరేషన్ కూడా ఫిక్స్ చేసి అడ్వాన్స్ అందించారని సమాచారం. అయితే రవితేజ క్యారెక్టర్ కి సంబంధించి నిడివి మరీ తక్కువగా కాకుండా ఎక్కువ సేపే ఉండనుందట.

ఇక రవితేజ హీరోగా నటించిన 'పవర్' సినిమాతో బాబీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇక రవితేజ మెగా స్టార్ అభిమాని అని అందరికీ తెలిసిందే. ఆయనతో కలిసి 'అన్నయ్య' సినిమాలో తమ్ముడిగా కనిపించాడు రవితేజ. అలాగే 'శంకర్ దాదా జిందాబాద్' లో ఓ సాంగ్ లో మెగాస్టార్ తో కలిసి మెరిశాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి చిరుతో కలిసి నటించబోతున్నాడు.

ఏప్రిల్ నుండి ఈ సినిమా షూట్ లో జాయిన్ అవ్వనున్నాడు రవితేజ. మరి మెగా సినిమాలో రవితేజ మెగా క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు 'వాల్తేర్ వాసు' అనే టైటిల్ పరీశీలనలో ఉంది. త్వరలోనే టైటిల్ ఫైనల్ చేసి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics