Prabhas , Maruthi Movie announcement soon !

Monday,March 14,2022 - 01:02 by Z_CLU

ప్రస్తుతం పీరియాడిక్ లవ్ స్టోరి 'రాధే శ్యామ్' తో థియేటర్స్ లో సందడి చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నెక్స్ట్ 'సలార్' , ఆది పురుష్', ప్రాజెక్ట్ కే' సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.  తాజాగా  మరో ప్రాజెక్ట్ కూడా లైన్లో పెట్టేశాడు డార్లింగ్. దర్శకుడు మారుతితో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఇటివలే 'రాధేశ్యామ్' ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి నోరు విప్పాడు ప్రభాస్. ఓ ఫన్ రైడ్ సినిమా చేయబోతున్నారట అంటే అవునని సమాధానం ఇచ్చాడు. కానీ మారుతి పేరు మాత్రం బయట పెట్టలేదు. మేకర్స్ ఈ సినిమాను ఓ మంచి ముహూర్తం చూసి ప్రకటించాలని చూస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ ఈ ప్రాజెక్ట్ ను రెండు మూడు రోజుల్లోనే సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నారు.

ఈ సినిమా మారుతి స్టైల్ లోనే హిలేరియస్ ఫన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్నట్లు తెలుస్తుంది. బడా సినిమాల మధ్యలో ఈ ప్రాజెక్ట్ కి ప్రభాస్ డేట్స్ ఇవ్వడానికి రీజన్ మారుతి చెప్పిన హిలేరియస్ స్క్రిప్టే అంటున్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారు.  ఏప్రిల్ నెలాఖరున లేదా మే నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఈ కాంబో సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే మరిన్ని ఈ కాంబో సినిమా గురించి మరిన్ని డీటెయిల్స్ బయటికి రానున్నాయి.

 
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics