Mahesh Trivikram Movie to release on Sankranthi 2023

Saturday,January 22,2022 - 06:50 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా #SSMB28 కి సంబంధించి ఓ రిలీజ్ డేట్ చక్కర్లు కొడుతుంది. అవును ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. జనవరి 12న సంక్రాంతి స్పెషల్ గా సినిమాను థియేటర్స్ లోకి తీసుకురాబోతున్నారనే టాక్ వినబడుతుంది.

నిజానికి మహేష్ కి సంక్రాంతి సెంటిమెంట్ ఉంది. ఇటివలే 'సరిలేరు నీకెవ్వరు'తో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే త్రివిక్రమ్ లాస్ట్ సినిమా 'అల వైకుంఠ పురములో' కూడా సంక్రాంతి కే విడుదలై బిగ్గెస్ట్ హిట్ సాధించింది. అందుకే ఇటు మహేష్ అటు త్రివిక్రమ్ కి కలిసొచ్చిన భారీ కలెక్షన్స్ తెచ్చి పెట్టే సంక్రాంతికే మేకర్స్ సినిమాను రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తుంది.

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా మరో రెండు మూడు నెలల్లో స్టార్ట్ కానుంది. ఈలోపు మహేష్ 'సర్కారు వారి పాట' షూట్ పూర్తి చేయాల్సి ఉంది. 'సర్కారు వారి పాట'కి సంబంధించి ఇంకా మెయిన్ పోర్షన్ మిగిలి ఉంది. ఈ లోపు త్రివిక్రమ్ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దనున్నాడు. సమ్మర్ లో షూట్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కల్లా సినిమాను రెడీ చేయాలని ప్లానింగ్ జరుగుతుంది. సినిమాలో మహేష్ చెల్లెలి పాత్రలో సాయి పల్లవి కనిపించనుందనే టాక్ చక్కర్లు కొడుతుంది. ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.