Macherla Niyojakavargam Theatrical Trailer Ready

Thursday,July 21,2022 - 04:40 by Z_CLU

నితిన్ హీరోగా నటిస్తున్న మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ 'మాచర్ల నియోజకవర్గం'. రోజుకో అప్ డేట్ తో ఈ సినిమా హల్ చల్ చేస్తోంది. ఇప్పడు 'మాచర్ల మాస్ లోడింగ్' అంటూ అదిరిపోయే అప్డేట్స్ ఇచ్చింది. జులై 23 న థర్డ్ సింగల్ అదిరిందే పాట విడుదల కానుంది. జూలై 26న మాచర్ల ధమ్కి రాబోతుంది. జూలై 29న 'మాచర్ల నియోజకవర్గం' థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇచ్చారు మేకర్స్.

పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ 'రారా రెడ్డి'లో సందడి చేస్తోంది. ఇటివలే విడుదలైన లిరికల్ వీడియోకు అద్భుతమైన స్పందన వచ్చింది.

macherla-nithin-anjali

ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నాడు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. రీసెంట్ గా సముత్తరఖని ఫస్ట్ లుక్ కూడా రిలీజైన సంగతి తెలిసిందే.

macherla samutharakhani

ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ పని చేస్తుండగా, మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు. 'మాచర్ల నియోజకవర్గం' ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.