List of Telugu (Tollywood) movies to Release in February 2022

Tuesday,February 01,2022 - 08:19 by Z_CLU

ఈ ఏడాది జనవరిలో 'బంగార్రాజు' మినహా రిలీజైన అన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఆశిష్ హీరోగా వచ్చిన 'రౌడీ బాయ్స్' మాత్రమే హిట్ అనిపించుకుంది. నెలఖరున వచ్చిన గుడ్ లక్ సఖి కూడా బోల్తా కొట్టింది. దీంతో ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఆశలన్నీ ఫిబ్రవరిలో విడుదలయ్యే సినిమాల మీదే ఉన్నాయి. ఫిబ్రవరి 4న విశాల్ 'సామాన్యుడు' రిలీజ్ అవ్వనుంది. అదేరోజు సుదీప్ నటించిన మరో డబ్బింగ్ సినిమా 'K3' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక కోతలరాయుడుతో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా రాబోతున్నాయి. వీటిలో 'సామాన్యుడు' మినహా మరే సినిమాకు బజ్ లేదు.

ఇక ఫిబ్రవరి 11 న రవితేజ 'ఖిలాడి' రిలీజ్ అవ్వబోతుంది. ప్రస్తుతానికి మేకర్స్ అదే డేట్ లాక్ చేసుకొని ముందుకెళ్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనున్నాయి. అదే రోజు 'డిజే టిల్లు' కూడా రాబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఇంకా మేకర్స్ అఫీషియల్ గా చెప్పలేదు. ఇక రాజశేఖర్ నటించిన 'శేఖర్' కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫిబ్రవరి 25న శర్వానంద్ -రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రిలీజ్ అవ్వనుంది. ఈ సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

ఈ మూవీస్ తో పాటు షెహరి, విక్రాంత్ రోణ, వాలిమై, వరుణ్ తేజ్ హీగో నటించిన గని సినిమాలు కూడా ఫిబ్రవరిలోనే రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇలా డబ్బింగ్ సినిమాలతో మొదలవ్వనున్న ఫిబ్రవరి నెల శర్వా సినిమాతో ఎండ్ అవ్వనుంది. మరి వీటిలో ఏ సినిమా మంచి టాక్ దక్కించుకొని డీసెంట్ కలెక్షన్స్ రాబడతాయో చూడాలి.