Prabhas’s Radheshyam to release on March 11

Tuesday,February 01,2022 - 08:09 by Z_CLU

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మోస్ట్ ఎవైటింగ్ లవ్ స్టోరి 'Radheshyam' సినిమాకు రిలీజ్ డేట్ లాక్ అయిందని తెలుస్తుంది. ఇటివలే 'RRR' సినిమా రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడంతో ఇక ప్రభాస్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు ప్రకటిస్తారా ? అని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు మూవీ లవర్స్. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకూ సినిమాను మార్చ్ 11న రిలీజ్ చేసే సన్నాహాల్లో ఉన్నారట మేకర్స్. తాజాగా ఈ డేట్ లాక్ చేసుకొని త్వరలోనే ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తుంది.

ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి విడుదలైన కంటెంట్ ఆడియన్స్ లో క్యూరియాసిటీ రైజ్ చేసేలా చేస్తుంది. ట్రైలర్ కి ఊహించని విధంగా భారీ రెస్పాన్స్ దక్కడంతో ప్రమోషన్స్ కూడా ఇంకా భారీగా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఫిబ్రవరి మొదటి వారంలోనే డేట్ ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ గా మరో టీజర్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వినిపిస్తుంది.

ప్రభాస్ -పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఈ పీరియాడిక్ లవ్ స్టోరీకి రాధాకృష్ణ దర్శకుడు. గోపికృష్ణ మూవీస్ కృష్ణంరాజు సమర్పణలో యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళు రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న ఈ సినిమా కోసం ఇతి ప్రభాస్ ఫ్యాన్స్ అటు మూవీ లవర్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు.