Lavanya Tripathi as Mallika in Chavi Kaburu Challaga
Sunday,October 25,2020 - 09:12 by Z_CLU
డింపుల్ బ్యూటి లావణ్య త్రిపాఠి మల్లిక గా చావుకబురు చల్లగా చిత్రంలో కనిపించనుంది. అందాల రాక్షసి చిత్రం లో మనింటి అమ్మాయిలా అందర్ని తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పడు మల్లిక గా మెదటి లుక్ లోనే అందరికి దగ్గరయ్యింది. ఇప్పడు మల్లిక మన బస్తి బాలరాజు తో జోడి కట్టేసింది.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో, బన్నీ వాసు నిర్మాతగా.. ఎనర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ, లావణ్య త్రిపాఠి జంటగా నూతన దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి తెరకెక్కిస్తున్న చిత్రం 'చావు కబురు చల్లగా'. ఇప్పటికే విడుదలైన టైటిల్.. హీరో కార్తికేయ 'బస్తి బాలరాజు' ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తరువాత విడుదలైన క్యారెక్టర్ వీడియోకి కూడా అనూహ్య స్పందన లభించింది. కార్తికేయ గెటప్, డైలాగ్ డెలివరి మాడ్యూలేషన్ చూస్తే మళ్లీ చూడాలనిపించేలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
ఇప్పుడు మల్లిక గా చాలా నాచురల్ గా ఉన్న లావణ్య లుక్ అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో ఈమె పాత్ర కూడా ఇంతే న్యాచురల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.