ZeeCinemalu – Oct 25

Saturday,October 24,2020 - 08:49 by Z_CLU

కథాకళి నటీనటులు : విశాల్, కేథరిన్ థెరిసా ఇతర నటీనటులు : కరుణాస్, ఇమ్మన్ అన్నాచి, గ్రేస్ కరుణాస్, గోపీ, పవన్, మధుసూదన్ రావు మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిళ డైరెక్టర్ : పాండిరాజ్ ప్రొడ్యూసర్ : పాండిరాజ్ రిలీజ్ డేట్ : 18 మార్చి 2016 విశాల్, కేథరిన్ థెరిసా జంటగా నటించిన లవ్ & యాక్షన్ ఎంటర్ టైనర్ కథకళి. U.S. లో స్టడీస్ కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన కమల్ ( విశాల్ ) అనుకోకుండా, సాంబ అనే వ్యక్తి మర్డర్ కేస్ లో ఇరుక్కుంటాడు. కమల కుటుంబానికి, సాంబ కుటుంబానికి చాలా కాలం నుండి వ్యక్తిగత కక్షలుండటంతో పోలీసులు కమల్ ని అనుమానిస్తుంటారు. అయితే నిజానికి ఆ హత్య చేసింది ఎవరు…? అసలు హీరో ఫ్యామిలీకి, సాంబ ఫ్యామిలీకి మధ్య ఎందుకు చెడింది..? అనేది ఈ సినిమాలో ప్రధాన కథాంశం. హీరో విశాల్, కేథరిన్ థెరిసా కి మధ్య ఉండే రొమాంటిక్ ట్రాక్ సినిమాలో హైలెట్ గా నిలుస్తుంది.

=======================

ఒక్కడొచ్చాడు నటీనటులు : విశాల్, తమన్నా ఇతర నటీనటులు : వడివేలు, జగపతి బాబు, సూరి, తరుణ్ అరోరా, జయప్రకాష్, నిరోషా మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : హిప్ హాప్ తమిజా డైరెక్టర్ : సూరజ్ ప్రొడ్యూసర్ : S. నంద గోపాల్ రిలీజ్ డేట్ : 23 డిసెంబర్ 2016 డీజీపీ చంద్రబోస్ (జగపతిబాబు) ఒక ధైర్యవంతుడైన పోలీస్ ఆఫీసర్. అతను దేవా (సంపత్) నుండి 50 కోట్ల డబ్బు రికవర్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే సిటీకి వచ్చిన అర్జున్ (విశాల్) దివ్య (తమన్నా) ని ప్రేమిస్తాడు. డీజీపీ చంద్రబోస్ చెల్లి అయిన దివ్య కూడా అతని బ్యాక్ గ్రౌండ్ ఏం తెలుసుకోకుండానే అతనితో లవ్ లో పడిపోతుంది. దివ్య ప్రేమని అంగీకరించిన చంద్రబోస్ పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేసే సమయంలో అర్జున్ తాను ఒక సిబిఐ ఆఫీసర్ అని చెప్తాడు. అంతేకాదు డీజీపీ దగ్గరనుండి 250 కోట్లు స్వాధీనం చేసుకుంటాడు. కానీ అక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేంటి…? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

================================

శివాజీ నటీనటులు : రజినీకాంత్, శ్రియ శరన్ ఇతర నటీనటులు : వివేక్, సుమన్, రఘువరన్, మణివన్నన్, వడివుక్కరసి, కోచిన్ హనీఫా తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : A.R. రెహమాన్ డైరెక్టర్ : S.శంకర్ ప్రొడ్యూసర్ : M.S. గుహన్, M. శరవణన్ రిలీజ్ డేట్ : 15 జూన్ 2007 ఫారిన్ నుండి దేశం కోసం ఏదైనా చేయాలనే ఆరాటం తో ఇండియాకి వస్తాడు శివాజీ. ప్రజల కోసం ఉచిత విద్య, వైద్యం అందించాలనే ఉద్దేశం తో ట్రస్ట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ శివాజే ఇలా చేయడం వల్ల తన వ్యాపారాలు దెబ్బ తింటాయని భావించిన కొందరు శివాజీని అడ్డుకుంటారు. అప్పుడు శివాజీ వారిని ఎలా ఎదుర్కుంటాడు…? తాను అనుకున్న విధంగా సమాజానికి సేవ చేయగలిగాడా..? లేదా..? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

=================================

స్టూడెంట్ నంబర్ 1 నటీనటులు : N.T.R., గజాల ఇతర నటీనటులు : రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, ఆలీ, సుధ, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి డైరెక్టర్ : S.S. రాజమౌళి ప్రొడ్యూసర్ : K. రాఘవేంద్ర రావు రిలీజ్ డేట్ : 27 సెప్టెంబర్ 2001 ఇంజనీర్ అవ్వాలనే ప్యాషన్ ఉన్నా కేవలం చేయని నేరానికి శిక్షననుభవిస్తున్న తండ్రిని కాపాడుకోవడానికి లా కాలేజ్ లో జాయిన్ అవుతాడు ఆదిత్య. ఓ వైపు మర్డర్ కేసులో జైలు పాలయినా, జైలులో ఉంటూ కూడా తన తండ్రి గౌరవం కాపాడటానికి కష్టపడతాడు. అసలు ఆదిత్య చంపింది ఎవరిని…? ఎందుకు చేశాడా హత్య..? తన తండ్రిని నిర్దోషిగా నిరూపించడంలో ఆదిత్య ప్రయత్నం సక్సెస్ అవుతుందా…? ఆదిత్య జైలు నుండి విడుదల అవుతాడా…? అనేదే ఈ సినిమా ప్రధానాంశం.

==============================

లై నటీనటులు : నితిన్, మేఘా ఆకాష్ ఇతర నటీనటులు : అర్జున్ సర్జ, శ్రీకాంత్, అజయ్, రవి కిషన్, నాజర్, ధృతిమాన్ ఛటర్జీ, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల మరియు తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ డైరెక్టర్ : హను రాఘవపూడి ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర రిలీజ్ డేట్ : 11 ఆగష్టు 2017 ‘లై’ స్టోరీలైన్ చెప్పాలంటే సినిమా మొత్తం టైటిల్ కు తగ్గట్టు అబద్ధాలు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీదే నడుస్తుంది. ఓ సూటు చుట్టూ అల్లుకున్న ఇంటలిజెంట్ స్టోరీలైన్ ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఒక సూట్ చుట్టూ కథ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ లో పాతబస్తీ కుర్రాడికి, లాస్ వెగాస్ లో ఉన్న విలన్ కనెక్ట్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే ‘లై’ కంప్లీట్ గా ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్. నితిన్, మేఘా ఆకాష్ కెమిస్ట్రీ సినిమాకి మరో ఎట్రాక్షన్.

===============================

రాక్షసుడు నటీనటులు : సూర్య, నయనతార ఇతర నటీనటులు : ప్రేమ్గీ అమరేన్, ప్రణీత సుభాష్, ప్రతిభాన్, రియాజ్ ఖాన్, సముథిరఖని, శరత్ తదితరులు మ్యూజిక్ డైరెక్టర్ : యువన్ శంకర్ రాజా డైరెక్టర్ : వెంకట్ ప్రభు ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా రిలీజ్ డేట్ : 29 మే 2015 సూర్య కరియర్ లోనే డిఫెరెంట్ సినిమాగా నిలిచింది రాక్షసుడు. సూర్య డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా అటు తమిళం లోను, తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. ఆత్మగా నటించిన సూర్య పర్ఫామెన్స్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. నయనతార ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.