Karthi’s Sardar Movie break evens in just 6 Days in Telugu States

Thursday,October 27,2022 - 02:33 by Z_CLU

దీపావళి కానుకగా థియేటర్లలోకొచ్చిన సర్దార్ సినిమా. గట్టి పోటీ మధ్య రిలీజైన ఈ సినిమా, దీపావళి విన్నర్ గా నిలిచింది. ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు పోటీలో ఉన్నప్పటికీ, సర్దార్ కంటెంట్ ముందు అన్నీ తేలిపోయాయి. విడుదలైన మొదటి రోజు మొదటి ఆటకే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

అలా మొదటి రోజు నుంచే సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సర్దార్ సినిమా, తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించింది. విడుదలైన 6 రోజుల్లో సర్దార్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం పెద్ద విషయం. తెలుగులో ఈ సినిమాను అన్నపూర్ణ పిక్చర్స్ కంపెనీపై హీరో నాగార్జున రిలీజ్ చేశారు.

స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తి, 2 డిఫరెంట్ షేడ్స్ లో కనిపించాడు. పోలీసాఫీసర్ గా, గూఢచారిగా మెప్పించాడు. రాశిఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు మిత్రన్ దర్శకత్వం వహించాడు.