Bimbisara Achieves 100 Million Streaming Minutes in ZEE5

Thursday,October 27,2022 - 02:30 by Z_CLU

కల్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ బింబిసార. థియేటర్లలో ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే స్థాయి సక్సెస్ అందుకుంది. దీపావళి కానుకగా ZEE5లో స్ట్రీమింగ్ కొచ్చిన బింబిసార సినిమా సంచలన విజయం సాధించింది. ఇప్పటివరకు 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ రికార్డ్ చేసి, సరికొత్త చరిత్ర సృష్టించింది.

బింబిసారతో చాలా పెద్ద రిస్క్ చేశాడు హీరో కల్యాణ్ రామ్. నిర్మాతగా, హీరోగా రెండు బాధ్యతలు పోషించి తను చేసిన రిస్క్ తో సూపర్బ్ రిజల్ట్ అందుకున్నాడు. భారీ బడ్జెట్ పెట్టడమే కాకుండా, వశిష్ఠ్ అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేసి ఇంకా పెద్ద రిస్క్ చేశాడు. పీరియాడిక్ జానర్ కు ఫిక్షన్ యాడ్ చేసి తీసిన ఈ సినిమా కల్యాణ్ రామ్ నమ్మకాన్ని నిలబెట్టింది.

విడుదలైన 3 రోజుల్లోనే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ సాధించిందంటే, బింబిసార ప్రభంజనాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇక నాలుగో రోజు నుంచి ఈ సినిమా ఏకథాటిగా 3 వారాల పాటు అందరికీ లాభాలు అందించింది. ఈమధ్య కాలంలో ఓవర్ ఫ్లోస్ ఇచ్చిన సినిమా ఇదొక్కటే. అంతేకాదు, ఈ సినిమాతో యూఎస్ లో మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరయ్యాడు కల్యాణ్ రామ్.

అలా థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే స్థాయిలో దూసుకుపోతోంది. ZEE5 లో ప్రస్తుతం టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు సృష్టించడం గ్యారెంటీ.

ఈ సినిమాలో కళ్యాణ్ రామ్.. బింబిసారుడుగా, దేవదత్తుడుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. హీరోగానే కాదు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాతగా ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాలో కళ్యాన్ రామ్ సరసన హీరోయిన్స్‌గా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. కీరవాణితో పాటు చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందించారు.