Kajal’s Satyabhama First look Glimpse released by Shekhar Kammula

Monday,June 19,2023 - 11:32 by Z_CLU

ప్రస్తుతం బాలకృష్ణ 'భగవంత్ కేసరి' సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్   మరొ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. #కాజల్ 60 గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సత్యభామ అనే టైటిల్ ఫిక్స్ చేసి కాజల్ పుట్టిన రోజు సందర్భంగా  శేఖర్ కమ్ముల ద్వారా ఫస్ట్ లుక్ గ్లిమ్స్  రిలీజ్ చేశారు.  ఇందులో సత్యభామ అనే పవర్ ఫుల్ పాత్రలో కాజల్ నటిస్తుంది. అఖిల్ డేగల సినిమాకి దర్శకత్వం వహించారు.  మునుపెన్నడూ కనిపించని విధంగా ప్రేక్షకులు ఇష్టపడే పాత్రలో కాజల్ కనిపించనుంది. అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమాకు గూడచారి , మేజర్ దర్శకుడు శశి కిరణ్ తిక్క సమర్పకుడు వ్యవహరిస్తూ స్క్రీన్ ప్లే కూడా అందించారు. శ్రీ చరణ్ పాకాల ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.