Hero Vishwak Sen Interview about AVAK

Wednesday,May 04,2022 - 05:30 by Z_CLU

ముప్పై ఏళ్ళు దాటినా ఇంకా పెళ్లవ్వని అర్జున్ కుమార్ అల్లం పాత్రలో విశ్వక్ సేన్ నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం' ఈ నెల 6వ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా రిలీజ్ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు విశ్వక్ మాటల్లోనే...

వద్దని తప్పించుకున్నా

ఈ స్క్రిప్ట్ చెప్పే ముందు నాకు సూటవ్వదేమో అనుకోని తప్పించుకున్నాను. కానీ  కథ విన్నాక వెంటనే చేసేద్దామని చెప్పాను. 'అశోక వనంలో అర్జున కళ్యాణం' అందరికీ కనెక్ట్ అయ్యే కథ. అర్జున్ కుమార్ అల్లం కేరెక్టర్ తో ఒక మంచి కథ చెప్పడం జరిగింది. నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుందని నమ్ముతున్నాను.

టైటిల్ అప్పుడే ఫిక్స్

స్క్రిప్ట్ చెప్పినప్పుడే 'అశోక వనంలో అర్జున కళ్యాణం' అనే టైటిల్ ఫిక్స్ చేసి నాకు చెప్పారు. వినగానే సాఫ్ట్ గా కొత్త సౌండింగ్ అనిపించింది. అందుకే అందరం అదే ఫిక్స్ అనుకున్నాం.

చాలా ఏళ్లయింది

నాకు తెలిసి పెళ్లి వేడుకతో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా ఏళ్లయింది. 'మురారి', నిన్నే పెళ్ళాడతా' తరహాలో ఉండే ఓ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. సరదాగా అనిపిస్తూ ఎంటర్టైన్ చేస్తుంది. చాలా మంది నటీ నటులు , పల్లెటూరి లోకేషన్స్ , స్మూత్ మ్యూజిక్ , బ్యూటిఫుల్ విజువల్స్ ఇలా అన్నీ ఎట్రాక్ట్ చేస్తాయి. కథలో కొన్ని డిస్కస్ చేసి డైలాగ్స్ తో చెప్పాం. ఆ సన్నివేశాలు అందరికీ బాగా నచ్చుతాయి. అమ్మాయిలు తక్కువ అయిపోవడం, అబ్బాయిలకు పెళ్లనేది ఎంత పెద్ద మేటర్ అనేదో కూడా చెప్పాం.

 

ఏడు కిలోలతో సరిపెట్టాను 

ఈ సినిమా కోసం ఓ పది కిలోలు పెరగమని మా డైరెక్టర్ చెప్పాడు. కానీ ఒకసారి బరువు పెరిగితే మళ్ళీ తగ్గడం చాలా కష్టం. అది ద్రష్టిలో పెట్టుకునే ఏడు కిలోల బరువుతో ఆపేశాను. మా డైరెక్టర్ ఇంకా రెండు మూడు కిలోలు పెరగమని రిక్వెస్ట్ చేశాడు. మళ్ళీ నెక్స్ట్ సినిమాకి తగ్గడం ఇబ్బంది అవుతుందని నచ్చ చెప్పి కావాలంటే పొట్ట పొట్ట అని రెండు మూడు డైలాగ్స్ ఎక్కువ పెట్టమని చెప్పాను. అలా అర్జున్ కుమార్ అల్లం పాత్ర కోసం అధిక బరువు పెరగాల్సి వచ్చింది.

నటుడిగా ఎలాంటి రోల్ అయినా ఒకే

నటుడిగా ఇదే చేయాలి, ఒకే జోనర్ సినిమా తీయాలి అనుకోవట్లేదు. అన్ని రకాల పాత్రలు చేయాలనేది నా ఉద్దేశ్యం. లైక్ కమల్ హాసన్ గారు. ఆయన చేసిన కొన్ని టిపికల్ పాత్రలు కూడా చేయాలని ఉంది.

 

కావాలని చేసింది కాదు

రెండ్రోజుల క్రితం నేను చేసిన ప్రాంక్ వీడియో కావాలని చేసింది కాదు. ప్రమోషన్స్ లో అది కూడా ఓ పార్ట్ అవుతుందని చేశాం. కానీ ఇంత ఇష్యూ జరిగి అనవసరమైన చర్చ అవుతుందని ఊహించలేదు. ప్రస్తుతానికి అంతా సర్దుమనిగిందని అనుకుంటున్నాను. ఇక ఈ ఇన్సిడెంట్ తో మా చుట్టాల కారణంగా మా అమ్మ ఎక్కువ ఇబ్బంది పడింది. నా పక్కనే ఉండే పెర్సన్ కి కాల్ చేస్తూ నేనెలా ఉన్నానో తెలుసుకుంటుంటే ఎందుకో అమ్మకి దైర్యం చెప్పాలనిపించి స్పీచ్ లో నన్ను ఎవరూ ఏమి చేయలేరని చెప్పాను.

నెక్స్ట్ సినిమాలు అవే

నా తదుపరి సినిమా ఓరి దేవుడా రిలీజ్ కి రెడీ గా ఉంది. నెక్స్ట్ నా డైరెక్షన్ లో 'ధమ్కి' సినిమా చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్ షూటింగ్ స్టేజిలో ఉంది. అలాగే సాహిత్ మోత్కూరి అనే దర్శకుడితో మరో సినిమా చేయబోతున్నాను. ఆ తర్వాత 'మాస్ కా దాస్' అనే టైటిల్ తో ఫలక్ నుమా దాస్ కి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నాను. అది పాన్ ఇండియా సినిమా.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics