Director Parasuram about ‘Sarkaru Vaari Paata’

Wednesday,May 04,2022 - 02:29 by Z_CLU

సూపర్ స్టార్ మహేష్ , కీర్తి సురేష్ జంటగా పరశురాం దర్శత్వంలో తెరకెక్కిన 'సర్కారు వారి పాట' రిలీజ్ కి రెడీ అయింది. మే 12న థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా గురించి కొన్ని విషయాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు దర్శకుడు పరశురాం.

 

మహేష్ కోసమే కోసమే పుట్టిన కథ

'మహర్షి' రిలీజ్ టైం 'సరిలేరు నీకెవ్వరు' సెట్స్ కి వెళ్ళే ముందు మహేష్ గారికి  ఈ స్టోరీ లైన్ చెప్పాను. గంటన్న సేపు ఫస్ట్ నెరేషన్ ఇచ్చాను అక్కడే స్క్రిప్ట్ లాక్ అయిపోయింది. ఆయన కరెక్షన్స్ చెప్పరు. నచ్చితే నచ్చింది లేదంటే నచ్చలేదు అని నిర్మొహమాటంగా చెప్పేస్తారు. తప్ప స్క్రిప్ట్ నచ్చాక కరెక్షన్స్ చెప్పడం లాంటివి చేయరు..చెప్పరు.  ఫైనల్ నరేషన్ ఇచ్చాక ఆయనకీ నచ్చి షేకాండ్ ఇచ్చి "ఎస్ వి ఆర్ డూయింగ్" అనేశారు. ఆయన కోసమే పుట్టిన కథ ఇది. ఆయనే చేయాలని రాసుకున్నాను.

 

ఆయనలో బెస్ట్ క్వాలిటీ అదే 

డైరెక్టర్ హ్యాపీ గా ఉండాలి అనుకునే మెంటాలిటీ ఉన్న హీరో మహేష్.  ప్రతీ సారి సర్ మీకు ఒకే నా ? అడుగుతుంటారు. అది ఆయనలో నాకు బాగా నచ్చింది. డైరెక్టర్ హ్యాపీ గా ఉండి సాటిస్ఫై అయితే సినిమా బాగా వస్తుందని బలంగా నమ్ముతారు.  డైరెక్టర్ కి ఫుల్ ఫ్రీడం ఇస్తూ వర్క్ చేస్తారు. అందుకే అవుట్ పుట్ అంత బాగా వస్తుంది.

 

టైటిల్ చెప్పగానే 

ముందు టైటిల్ అనుకోలేదు. ఒకరోజు ఫోన్ లో ఈ టైటిల్ అనుకుంటున్నా ఎలా ఉండండి అనగానే అదిరింది అన్నారు. వెంటనే టైటిల్ లాక్ చేసేశాం. ఇక లుక్ విషయంలోనూ చాలా కేర్ తీసుకున్నారు. లాంగ్ హెయిర్ తో ఇంకాస్త యంగ్ గా కనిపించారు. కచ్చితంగా చెప్తున్నాను సినిమాలో సరికొత్త మహేష్ ని చూస్తారు. 'సర్కారు వారి పాట' మహేష్ నుండి ఆశించే అన్ని ఎలిమెంట్స్ తో పవర్ ప్యాకెడ్ సినిమా.

 

ప్రతీ మనిషి కనెక్ట్ అవుతాడు 

ఒక ప్రిన్సిపల్ ఫాలో అవుతున్న హీరోకి సేమ్ ఇష్యూతో వేరే పర్పషణ్ ఉన్న వ్యక్తి తగిలితే ఎలా ఉంటుంది ? అసలు హీరో సిద్దాంతం ఏమిటి ? దాన్ని బలంగా ఎలా వినిపించాలి అనే ఇడియా నుండి రాసుకున్న కథ ఇది. ఒక వ్యక్తి టార్గెట్ చేసిన సినిమా కాదు. ఒక వ్యవస్థ గురించి చెప్తూ నడిచే సబ్జెక్ట్. ఫైనల్ గా ఈ సర్కారు వారి పాట అనేది ఏంటి ? అనేది ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రేపు థియేటర్ లో ప్రతీ మనిషి హీరో కేరెక్టర్ తో కనెక్ట్ అవుతూ మనమే కదా అనుకుంటాడు.

 
  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics