Gopichand Vs Nani… September 10 Box office war

Sunday,September 05,2021 - 10:40 by Z_CLU

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అప్పుడప్పుడు సినిమాల పోటీ కామనే. కానీ ఈ మధ్య సినిమాలు రిలీజ్ అవ్వనందున ఆ పోటీ తప్పింది. కానీ మరో ఆరు రోజుల్లో చాన్నాళ్ళకి మళ్ళీ రెండు సినిమాల నడుమ పోటీ జరగనుంది. అవును మ్యచో హీరో గోపీచంద్ నేచురల్ స్టార్ నాని ఈసారి తమ సినిమాలతో పోటీ పడబోతున్నారు. కాకపోతే వీరిద్దరి మధ్య బాక్సాఫీస్ పోటీ కాకుండా థియేటర్ Vs OTT పోటీ జరగనుంది.

అవును సెప్టెంబర్ 10న వినాయక చవితి స్పెషల్ గా గోపీచంద్ హీరోగా నటించిన 'సీటీమార్' థియేటర్స్ లో అడుగుపెడుతుంది. అదే రోజు OTT ద్వారా నాని నటించిన 'టక్ జగదీష్' విడుదలవుతుంది. దీంతో ఇప్పుడు థియేటర్స్ Vs ఓటీటీ అంటూ ఓ కొత్త పోటీ నెలకొంటుంది. ఇప్పటివరకు కాస్త బజ్ ఉన్న సినిమాలు ఒకే రోజు ఇలా థియేటర్ , OTT లో రిలీజ్ అవ్వలేదు. దీంతో ఈ రెండు సినిమాల గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో అలాగే ఆడియన్స్ లో గట్టి చర్చ నడుస్తుంది. ఇక సెకండ్ వేవ్ తర్వాత భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న 'సీటీమార్' పై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబ్యూటర్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు.

నిజానికి నాని టక్ జగదీష్ OTT డీల్ ఎప్పుడో క్లోజ్ అయింది. కానీ ఇటివలే రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఇక సీటిమార్ సినిమాను సెప్టెంబర్ 3న థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ సెప్టెంబర్ 10న థియేటర్స్ లో రిలీజ్ అవ్వాల్సిన 'లవ్ స్టోరి' పోస్ట్ పోన్ అవ్వడంతో ఆ డేట్ కి సీటిమార్ ని రిలీజ్ చేస్తున్నారు. వినాయకచవితి కనుకగా విడుదలవుతున్న ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితం అందుకుంటాయి ? ఏ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ? అనే డిస్కషన్ నడుస్తుంది. మరి ఈ పోటీలో జనాలని థియేటర్స్ కి రప్పించి గోపీచంద్ గెలుస్తాడా ? లేదా OTT ద్వారా ఇంట్లోకి వెళ్లి అందరినీ పలకరించనున్న నాని గెలుస్తాడా ? చూడాలి.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics