Balakrishna Anil Ravipudi movie latest update

Saturday,September 04,2021 - 03:43 by Z_CLU

ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో 'అఖండ' సినిమా చేస్తున్న బాలకృష్ణ త్వరలోనే గోపీచంద్ మలినేని తో ఓ సినిమాను అలాగే అనిల్ రావిపూడి తో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మొన్న బాలయ్య పుట్టినరోజున ఈ రెండు సినిమాల నుండి ఎనౌన్స్ మెంట్ వస్తుందని అందరు అనుకున్నారు. కానీ బాలయ్య -గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించి మాత్రమే ఎనౌన్స్ మెంట్ వచ్చింది. ఈ సినిమాను ఎఫీషియల్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపారు మేకర్స్.

అయితే బాలయ్య -అనిల్ రావిపూడి సినిమా మాత్రం ఎనౌన్స్ అవ్వకపోవడంతో ఈ సినిమా ఇప్పుడే ఉండదనే టాక్ స్ప్రెడ్ అయింది. కానీ ఇప్పుడు ఆ సినిమా గురించి అప్ డేట్ వచ్చేసింది. వచ్చే నెల విజయదసమి సందర్భంగా ఈ క్రేజీ కాంబో సినిమాను ఎనౌన్స్ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఈ విషయాన్ని తెలిపారు నిర్మాత సాహు గారపాటి.

బాలయ్య -అనిల్ రావిపూడి సినిమా షైన్ స్క్రీన్స్ బేనర్ పై సాహు గారపాటి -హరీష్ పెద్ది నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టేసాడు అనిల్ రావిపూడి. F3 సినిమా షూటింగ్ బ్రేక్ లో బాలయ్య సినిమా పనులు చకచకా చేసేస్తున్నాడు. ఇప్పటికే కాస్టింగ్,  టెక్నీషియన్స్ ని కూడా లాక్ చేసుకున్నారు. అయితే దసరా కి సినిమా ఎనౌన్స్ అయినా వెంటనే షూటింగ్ ఉండకపోవచ్చు. గోపీచంద్ మలినేని సినిమాకు సంబంధించి ఒక షెడ్యుల్ పూర్తయ్యాక బాలయ్య ఈ సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అఖండ సినిమాకు సంబంధించి ఒక పాట షూట్ మిగిలి ఉంది. అది పూర్తవ్వగానే గోపీచంద్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ సినిమాను స్టార్ట్ చేస్తాడు బాలయ్య. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమాను సెట్స్ పై పెడతాడు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics