Film Chamber of commerce special request to Producers

Thursday,July 08,2021 - 12:14 by Z_CLU

సినిమా హాళ్ళను కాపాడమని తెలుగు సినిమా నిర్మాతలకు.. తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ రిక్వెస్ట్ చేసింది. అక్టోబర్ వరకు ఓటీటీలకు సినిమాలు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో మీటింగ్ అయింది..

తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీ మోహన్ మాట్లాడుతూ... "మా అందరి అభిప్రాయం ఒక్కటే..అక్టోబర్‌ 30 వరకు నిర్మాతలందరూ కూడా తమ సినిమాలను ఓటీటీలకు అమ్మకండని రిక్వెస్ట్‌ చేస్తున్నాను. ఆ తరువాత కూడా బాగా లేదంటే ఓటీటీలకు అమ్ముకోండి. నిర్మాతలెవ్వరూ కూడా ఇప్పుడే ఓటీటీలకు వెళ్లకండి" అన్నారు.

film chamber of commerce

తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. "చిన్నవాళ్లు అమ్ముకున్నారంటే పర్లేదు.. కనీసం పెద్ద వాళ్లు అయినా ఓటీటీ అమ్మకాలు ఆపాలి? కనీసం అక్టోబర్‌ 30 వరకైనా ఆపుకోండి. సినిమాను కాపాడండి. ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి..నేను కూడా సినిమాలు తీస్తున్నా. నేను కూడా నిర్మాతనే. నాక్కూడా ఆ బాధలు తెలుసు. నిర్మాత కంటే డిస్ట్రిట్యూబర్స్, ఎగ్జిబిటర్స్‌ ఎక్కువ బాధలు పడుతున్నారు. అందుకని, ఓటీటీకి సినిమాలు ఇవ్వకండి. ఒకవేళ అక్టోబర్ 31వరకు థియేటర్లు ఓపెన్ కాకపోతే అప్పుడు ఇచ్చుకోండి. మేం నిర్మించిన 'లవ్ స్టోరీ' సినిమాకు పది ఆఫర్లు వచ్చాయి. అయినా ఓటీటీలకు ఇవ్వలేదు. మా రిక్వెస్ట్‌ను నిర్మాతలందరూ వింటారని అనుకుంటున్నాను"

హీరోలకు కూడా ఓటీటీలకు సినిమాలు ఇవ్వడం ఇష్టం లేదని... హీరోలందరి మద్దతు తమకు ఉందని చెబుతున్నారు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు. థియేటర్లు ఓపెన్ అయితే ఓటీటీలు 40-50 కోట్ల ఆఫర్లు ఇవ్వవని.. థియేటర్స్ ప్రజెంట్ క్లోజ్ ఉన్నాయి కాబట్టి అంత అమౌంట్ ఇస్తున్నాయని అన్నారు. అందుకని, అక్టోబర్ వరకు వెయిట్ చేయమని వీళ్లంతా రిక్వెస్ట్ చేస్తున్నారు.

  • - Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics